2022 సంవత్సరంలోని బిగ్గెస్ట్ హిట్లలో ఆర్.ఆర్.ఆర్ ముందువరసలో ఉంటుంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఏ రేంజ్ లో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చిందనే సంగతి తెలిసిందే. అయితే నాని కొడుకు నాటు నాటు సాంగ్ కు స్టెప్పులు వేయగా అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం. నాని ట్విట్టర్ ద్వారా ఈ వీడియోను పంచుకున్నారు.
నాని కొడుకు అర్జున్ కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. కొడుకు పక్కన ఉంటే నాని కూడా పిల్లాడిలా మారిపోతాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నాని కొడుకు స్టెప్పులతో అదరగొట్టాడుగా అంటూ నెటిజన్లు చెబుతున్నారు. నాటు నాటు సాంగ్ ను పాడుతూ అర్జున్ స్టెప్పులు వేయడం గమనార్హం. నాని హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెబుతూ తన కొడుకు చేసిన అల్లరిని నెటిజన్లతో పంచుకున్నారు.
రాబోయే రోజుల్లో నాని (Nani) కొడుకు అర్జున్ కూడా సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాని ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఈ పోస్ట్ కు 12,000కు పైగా లైక్స్ వచ్చాయి. అర్జున్ తో కలిసి మంచు కొండల్లో స్లైడింగ్ చేస్తున్న వీడియోను సైతం నాని పంచుకున్నారు. నాని షేర్ చేసిన క్యూట్ వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నాని, మృణాల్ కాంబోలో తెరకెక్కిన హాయ్ నాన్న మూవీ డిసెంబర్ నెల 7వ తేదీన రిలీజ్ కానుంది.
ఎమోషనల్ మూవీగా తెరకెక్కిన హాయ్ నాన్న నాని కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హాయ్ నాన్న నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ తో తెరకెక్కుతోందని శౌర్యవ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. నాని హాయ్ నాన్న మూవీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. దసరా మూవీ కలెక్షన్లను ఈ మూవీ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
https://twitter.com/NameisNani/status/1724378905795235957
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!