Tuck Jagadish Trailer: నిజంగా పండగలాంటి సినిమాలానే ఉంది..!

‘నిన్నుకోరి’ వంటి సూపర్ హిట్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్‌ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో రాబోతున్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ మూవీ ‘టక్ జగదీష్’. రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ వంటి భామలు హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. నాని కెరీర్లో 26వ చిత్రంగా ‘టక్ జగదీష్’ రూపొందింది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆల్రెడీ విడుదలైన టీజ‌ర్‌,లిరికల్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి థియేటర్లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది.

కానీ ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా అది కుదర్లేదు. దీంతో సెప్టెంబర్ 10న వినాయక్ చవితి కానుకగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదల చేయబోతున్నారు. ఇక ప్రమోషన్లలో భాగంగా కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.’భూదేవిపురం గురించి మీకో కథ చెప్పాలి’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. అటు తర్వాత ‘ఆ వీరేంద్రకి భయపడకుండా జనం కోసం ఎవరైనా నిలబడాలి కదా’ అంటూ జగపతిబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ డైలాగ్ చెబుతున్నాడు. కట్ చేస్తే మన హీరో యాక్షన్ యాంగిల్ ను చూపించారు.

‘నీ చేత గరగ కట్టిస్తాను అని మొక్కుకున్నాను రా’ అంటూ హీరో తల్లి.. అతనికి ఎమోషనల్ గా ఓ డైలాగ్ చెబుతుంది. అటు తర్వాత వి.ఆర్.ఓ గా గుమ్మడి వరలక్ష్మీ గా హీరోయిన్ రీతూ వర్మ ఎంట్రీ. అంతకు ముందు మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ‘అయినవాళ్లకంటే ఆస్తులు, పదవులు ఎక్కువ కాదు’ ‘భూకక్షలు లేని భూదేవిపురం చూడాలన్నది మా నాన్న కోరిక.. ఇప్పుడు అది నా బాధ్యత’ అంటూ నాని చెప్పే డైలాగ్ హైలెట్ గా అనిపిస్తుంది. నాని, జగపతి బాబులు ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు కాదు స్టెప్ బ్రదర్స్ అని స్పష్టమవుతుంది. ట్రైలర్ అంతా మాస్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో నింపేశారు. నిజంగా పండగలాంటి సినిమా అనే ఫీలింగ్ ట్రైలర్ కలిగిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus