‘వి’ మూవీ సెన్సార్ రివ్యూ…!

నాని, సుధీర్ బాబు లు హీరోలుగా అదితి రావ్ హైదరి, నివేదా థామస్ లు హీరోయిన్లుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘వి’. నిజానికి ఈ చిత్రాన్ని మార్చి 25 న థియేటర్లలో విడుదల చెయ్యాలి అనుకున్నారు. కానీ కరోనా వైరస్ మహమ్మారి వల్ల థియేటర్లు మూతపడటంతో అది వర్కౌట్ కాలేదు.ఇప్పటికే 5 నెలలు కావస్తోంది…. ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. ఈ క్రమంలో ‘వి’ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు.. ఓటిటి లో విడుదల చెయ్యడానికి రెడీ అయ్యారు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది.

విశేషం ఏమిటంటే 12 ఏళ్ల క్రితం నాని మొదటి చిత్రం అయిన ‘అష్టా చమ్మా’ కూడా సెప్టెంబర్ 5నే విడుదల అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎటువంటి కట్స్ లేకుండా యూ /ఎ సర్టిఫికేట్ ను జారీ చేసారు. ఈ చిత్రంలో నాని సీరియల్ కిల్లర్ గా నటిస్తున్నాడు. తనకి భార్య(అదితి రావు)ని చంపేసిన వారిని దారుణంగా చంపేసే కిల్లర్ గా నాని నటిస్తున్నాడు. నాని చంపేసిన ప్రతీ ఒక్క డెడ్ బాడీ దగ్గర తన భార్య పేరులోని మొదటి అక్షరమైన ‘వి’ ని వదిలి వెళుతూ ఉంటాడని తెలుస్తుంది.

ఇక అతన్ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నాడు.ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేసాడట దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ‘వి’ క్లైమాక్స్ లో నాని చనిపోయినట్టు పోలీసులు అనుకుంటున్న తరుణంలో నాని ని బ్రతికి ఉన్నట్టు చూపించి సీక్వెల్ ఉండబోతున్నట్టు హింట్ ఇస్తారని సమాచారం. మరి వీటిలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus