నాని 25 వ చిత్రంగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ వి ‘. సుధీర్ బాబు కూడా ఈ చిత్రంలో మరో హీరోగా నటించాడు.టీజర్ విడుదల చేసినప్పటి నుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో భారీగా బిజినెస్ జరిగింది.నిజానికి 2020 లో మార్చి ఎండింగ్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల అనుకున్న టైం కి ఈ చిత్రం విడుదల కాలేదు.
అటు తరువాత సెప్టెంబర్ నెలలో అమెజాన్ ప్రైమ్ ఓటిటి వేదికగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ధియేటర్ లలో కనుక ఈ చిత్రం విడుదల అయ్యుంటే.. కచ్చితంగా డిజాస్టర్ అయ్యి ఉండేది .. ఓటిటి కి ఇచ్చేసి మంచి పని చేశారు అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా నిర్మాతలు ఈ విషయం పై స్పందించి సంచలన కామెంట్స్ చేసారు.
‘ వి మూవీ ని కరోనా లాక్ డౌన్ తరువాత అంటే ధియేటర్లు తెరుచుకున్న తరువాత రిలీజ్ చేసి ఉంటే కచ్చితంగా కమర్షియల్ సక్సెస్ అందుకునేది. ముందు నుండీ ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. త్వరగా దీనిని ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశంతోనే ఓటిటి కి ఇచ్చేసాం. ఈ చిత్రం మాకు లాభాలను ఇచ్చింది అలాగే ప్రైమ్ వారికి కూడా లాభాలను ఇచ్చింది ‘ అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. దిల్ రాజు తో కలిసి హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!