Nani vs Suriya: నాని సినిమాకు సూర్య ఎఫెక్ట్.. ఈ క్లాష్ తగునా?

సమ్మర్ సీజన్‌లో రిలీజ్ డేట్ల కోసం పెద్ద హీరోల మధ్య పోటీ సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఈసారి సమ్మర్ లో టాలీవుడ్ నాని, కోలీవుడ్ సూర్య మధ్య క్లాష్ జరుగనుందనే వార్తలు సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నాని, తన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3ను మే 1న విడుదల చేయబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు. ఈ సినిమాలో నాని పోలీస్ అధికారిగా కనిపించబోతుండగా, అభిమానులు ఈ కొత్త కాన్సెప్ట్ పై పాజిటివ్ హైప్ తోనే ఉన్నారు.

Nani vs Suriya

ఇదే సమయంలో, తమిళ స్టార్ సూర్య తన తదుపరి చిత్రం రెట్రోను అదే రోజు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కంగువా చిత్రంతో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిన సూర్య, ఈసారి పక్కా ప్లాన్‌తో తిరిగి రావాలని చూస్తున్నాడు. రెట్రో గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో నాని మంచి ఫాలోయింగ్ కలిగి ఉండగా, హిట్ 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

జెర్సీ వంటి సినిమాలతో తమిళనాడులోనూ నానికి గుర్తింపు ఉండటం, హిట్ 3కి అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలను చూపిస్తోంది. ఇక సూర్య విషయానికి వస్తే, అతని సినిమాలు తెలుగు ఆడియన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతాయి. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. అయితే, రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో, థియేటర్ల దొరికే సంఖ్య, మల్టీప్రెక్స్‌లు, వసూళ్లపై ప్రభావం పడనుందని ట్రేడ్ సర్కిల్స్ భావిస్తున్నాయి.

మరి ఇద్దరు ఒకేసారి వస్తే వారాంతంలో ఏ సినిమా ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకట్టుకుంటుందో, బాక్సాఫీస్ దగ్గర విజేతగా నిలుస్తుందో చూడాలి. రెండు చిత్రాల ప్రమోషన్ కూడా కీలకంగా మరే ఛాన్స్ ఉంది. హిట్ 3 ట్రైలర్, నాని యాక్షన్ సీక్వెన్స్‌లపై వచ్చే హైప్ సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు. మరోవైపు, రెట్రో టీజర్, సూర్య గ్యాంగ్‌స్టర్ లుక్ ఇప్పటినుంచే బజ్ క్రియేట్ చేస్తోంది.

ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేయబోతున్న16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus