మాస్ అవతారంలో నాని.. చూస్తే షాకవ్వాల్సిందే!

నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది ‘టక్ జగదీష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవలే నాని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ హీరో ‘అంటే సుందరానికి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇవి కాకుండా తాజాగా నాని మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాని కెరీర్ లో 29వ సినిమా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను దసరా కానుకగా విడుదల చేశారు. ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. ఈ సినిమాకి ‘దసరా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో నాని లుక్ ని చూసినవారంతా షాకవుతున్నారు. అసలు నానియేనా అన్నట్లుగా ఉన్నాడు. తొలిసారి ఊరమాస్ గెటప్ లో కనిపించాడు నాని. ‘జమ్మి వెట్టి జెప్తాన్న బద్దల్ బాసిoగాలైతై, సూస్ కుందాం’ అంటూ ఈ పోస్టర్ కి క్యాప్షన్ కు ఇచ్చారు.

దీన్నిబట్టి చూస్తుంటే.. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడతారని తెలుస్తోంది. ఈ సినిమాతో శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus