Court: నాని కోర్ట్ కోసం అడ్వాన్స్ రిస్క్.. బజ్ కోసం తప్పట్లేదుగా..!

నేచురల్ స్టార్ నాని మరో విభిన్న కథతో ముందుకు వస్తున్నాడు. హీరోగా రానిస్తూ, తన వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ ద్వారా కొత్త కథలను ప్రోత్సహిస్తున్న నాని (Nani) , ఇప్పుడు కోర్ట్ (Court) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రియదర్శి (Priyadarshi Pulikonda)  , హర్ష్ రోషన్ (Harsh Roshan), శ్రీదేవి, శివాజి (Sivaji), సాయి కుమార్ (Sai Kumar) వంటి నటులతో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. న్యాయవ్యవస్థలోని కీలక అంశాలను హైలెట్ చేస్తూ, కోర్ట్ హాల్స్‌లో నడిచే వాదనలను చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

Court

సినిమాపై ఆసక్తిని పెంచేందుకు నాని మరో వ్యూహం అమలు చేస్తున్నాడు. సాధారణంగా విడుదలకు ముందు ప్రివ్యూ షోలు ఉంటాయి. కానీ ఈసారి కోర్ట్ విషయంలో 2-3 రోజుల ముందే పబ్లిక్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టాక్ ఎలా వస్తుందో ముందే అర్థం చేసుకుని, నెగటివ్ ప్రచారానికి స్కోప్ లేకుండా, మొదటి రోజు నుంచే గట్టి కలెక్షన్లు సాధించేందుకు ఇది మెుదటిసారి ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది. ఇది చిన్న సినిమాలకు పెద్దగా పాటించని స్ట్రాటజీ అయినా, నాని మార్కెటింగ్ మెథడ్స్ అందరికీ తెలిసిందే.

ఇప్పటివరకు వాల్ పోస్టర్ బ్యానర్‌లో వచ్చిన సినిమాల్లో కొత్తదనం స్పష్టంగా కనిపించింది. గత సినిమాలను స్లో బర్నర్‌గా నిలిపి, తక్కువ సమయంలో మంచి వసూళ్లు అందించగలిగిన నాని, ఇప్పుడు కోర్ట్ విషయంలో ముందుగా పబ్లిక్ షోలు వేసి, పాజిటివ్ రివ్యూస్‌ను ముందే బయటకు వచ్చేలా చేయాలని చూస్తున్నాడు. ఈ ప్లాన్ హిట్ అయితే, చిన్న సినిమాల ప్రమోషన్లలో కొత్త ట్రెండ్ ప్రారంభమైనట్లే. కథ విషయానికి వస్తే, న్యాయ వ్యవస్థలో అసమానతలపై ఫోకస్ చేస్తున్న సినిమా అన్న ప్రచారం ఉంది.

కానీ కథలో మలుపులు ఉంటాయని కూడా అంటున్నారు. ఇది పూర్తిగా కోర్ట్ డ్రామా కాని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని టాక్. అఫీషియల్ సమాచారం లేకపోయినా, ట్రైలర్‌తో వచ్చిన హైప్ చూస్తే, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడంలో టీమ్ సక్సెస్ అయినట్లే. ఇంతకీ, ఈ అడ్వాన్స్ బజ్ ప్లాన్ పనిచేస్తుందా? లేదంటే ఈ రిస్క్ తీసుకోవడం వల్ల కొత్త సమస్యలు వస్తాయా? అనేది చూడాలి.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ- రిలీజ్ రెండో రోజు కూడా ఊహించని కలెక్షన్స్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus