అదేంటో కానీ ఒక్కోసారి ఎంత మంచి టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం రావు. ఒక్కో సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు అదిరిపోతుంటాయి. రిలీజ్ టైమింగ్ బ్యాడో.. ఏమో కానీ… ఈ మథ్య విడుదలైన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రానికి మంచి టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం సరిగ్గా రాబట్టలేకపోతుంది. వీకెండ్ వరకూ మంచి కలెక్షన్లను రాబట్టిన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’.. ఆ తరువాత మాత్రం ఆ జోరు చూపించలేకపోయిందనే చెప్పాలి.
ఇక ఈ చిత్రం క్లోజింగ్ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 6.62 cr |
సీడెడ్ | 1.60 cr |
ఉత్తరాంధ్ర | 2.18 cr |
ఈస్ట్ | 1.33 cr |
వెస్ట్ | 0.98 cr |
కృష్ణా | 1.24 cr |
గుంటూరు | 1.30 cr |
నెల్లూరు | 0.55 cr |
ఏపీ + తెలంగాణ | 15.80 cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 1.65 cr |
ఓవర్సీస్ | 3.69 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 21.14 cr (షేర్) |
‘నానీస్ గ్యాంగ్ లీడర్‘ చిత్రానికి 28 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం ఫైనల్ గా 21.14 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల వరకూ నష్టపోయినట్టు తెలుస్తుంది. అయితే తరువాత ‘గద్దలకొండ గణేష్’ చిత్రం రావడం మాస్ జనాలు ఎక్కువ ఆ చిత్రానికే క్యూ కట్టారు. దీంతో ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రం మాస్ జనాలు ఈ చిత్రం కోసం ఎగపడ్డారు. దీంతో ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ కలెక్షన్లు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ‘జెర్సీ’ తో మంచి హిట్టందుకున్న నానికి ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ తో మరో ప్లాప్ పడినట్టయ్యింది.
గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి