HIT3: నాని హిట్ 3 – ఈసారి రాజుగారి డీల్ ఎంత?

నేచురల్ స్టార్ నాని  (Nani)  హిట్ సిరీస్‌లో మూడో భాగంగా రాబోతున్న హిట్ 3 (HIT3) మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని ఓ పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. గత రెండు పార్ట్‌లను చూసినవారు ఈసారి మరింత ఇంటెన్స్ యాక్షన్‌తో నాని కొత్త అవతారాన్ని చూస్తారని అర్థమవుతోంది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే మంచి దూకుడు మీద ఉన్నట్లు తెలుస్తోంది.

HIT3

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌పై ముందుగానే ఆసక్తి కనబరిచి, తెలుగు రాష్ట్రాల హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. నాని, వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌తో చర్చలు జరిపి మంచి డీల్ క్లోజ్ చేసినట్లు టాక్. గతంలో నాని నటించిన సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాను 30 కోట్లకు కొనుగోలు చేసిన దిల్ రాజు (Dil Raju), కేవలం 3 కోట్ల రేంజ్ లోనే లాభాలు అందుకున్నట్లు టాక్.

అయితే, హిట్ 3 (HIT3) టీజర్ చూసిన తర్వాత ఈ సినిమాతో కచ్చితంగా మంచి లాభాలు రాబట్టొచ్చని నమ్మకం పెరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాని కెరీర్‌లో ఇదొక పవర్‌ఫుల్ పోలీస్ రోల్‌గా నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. గత రెండు పార్ట్‌ల కంటే భారీ స్థాయిలో యాక్షన్, థ్రిల్ ఎలిమెంట్స్ ఉండేలా దర్శకుడు శైలేష్ కొలనూ (Sailesh Kolanu) ప్లాన్ చేశారని సమాచారం. మే 1న గ్రాండ్ రిలీజ్ కావాల్సిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల కంటే ఎక్కువ థియేట్రికల్ బిజినెస్ చేయగలదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దిల్ రాజు ఇటీవల పెద్దగా విజయాలను నమోదు చేయలేకపోయాడు. సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) మంచి లాభాలు తెచ్చిపెట్టినప్పటికీ, గేమ్ ఛేంజర్ (Game Changer) భారీ నష్టాన్ని మిగిల్చింది. అందుకే మీడియం రేంజ్ తరహా సినిమాలపై ఫోకస్ పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. హిట్ 3 లాంటి థ్రిల్లర్ సినిమాలు ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్‌పై పెట్టిన బెట్టింగ్ వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus