ఆ హాలీవుడ్ సినిమాకు కాపీగా నాని జెర్సీ

మొన్నటివరకూ వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న నాని ఒక్కసారిగా డల్ అయ్యాడు. ముఖ్యంగా.. “కృష్ణార్జున యుద్ధం” డిజాస్టర్ నాని కెరీర్ కంటే మనోడి మైండ్ సెట్ ను బాగా ఎఫెక్ట్ చేసింది, అందుకే తన తదుపరి చిత్రాల విషయంలో చాలా జాగ్రత్త వహించడం మొదలెట్టాడు నాని. అందులో భాగంగానే నాగార్జునతో కలిసి “దేవదాస్” అనే మల్టీస్టారర్ లో నటించాడు. ఆ సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికీ పెద్దగా లాభాలు రాలేదు. దాంతో తన రొటీన్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి “మళ్ళీ రావా” ఫేమ్ గౌతమ్ దర్శకత్వంలో “జెర్సీ” సినిమా మొదలెట్టాడు నాని. మొన్న విడుదలైన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

36 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి తాను క్రికెటర్ అవ్వాలన్న ఆశయాని నెరవేర్చుకోవడం కోసం చేసిన ప్రయత్నమే ఈ చిత్ర కథాంశం. టీజర్ చూస్తుంటే.. “ఇన్విన్సబుల్” అనే హాలీవుడ్ సినిమా గుర్తొస్తుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా కాన్సెప్ట్ కూడా సేమ్ కావడంతో ఆ సినిమాకూ రీమేక్ గా “జెర్సీ” తెరకెక్కుతోందని, నాని ఇలా ఫ్రీమేక్ లు చేయడం కంటే ఏదైనా ఒరిజినల్ స్క్రిప్ట్ ఎంపిక చేసుకొని ఉండి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నెగిటివిటీని పక్కన పెట్టేస్తే.. ఏప్రిల్ లో విడుదలకానున్న ఈ చిత్రంపై నాని మాత్రం చాలా అంచనాలు పెట్టుకొన్నాడు. మరి ఏమవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus