న్యాచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు క్రేజ్ తో పాటు మార్కెట్ ను సైతం పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం అనే విభిన్నమైన టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా 45 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఈ మధ్య కాలంలో వరుసగా క్రేజీ సినిమాలలో నటిస్తున్న నాని సరిపోదా శనివారం సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు.
ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడం గమనార్హం. సరిపోదా శనివారం సినిమాతో నాని జాక్ పాట్ కొట్టారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాని సరైన ప్రాజెక్ట్ లతో ముందుకు వెళ్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో ఎస్.జే.సూర్య కీలక పాత్రలో నటిస్తుండటం గమనార్హం. ఎస్.జే.సూర్య ఈ సినిమా కోసం 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
ఈ సినిమా దాదాపుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. నాని ఈ సినిమాకు 27 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా ఇతర భాషల్లో నాని ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటారో చూడాలి.
తన సినిమాలను పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా రిలీజ్ చేయడానికి నాని (Nani) ఆసక్తి చూపిస్తున్నారు. కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్న నాని గతేడాది దసరా, హాయ్ నాన్న సినిమాతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!