ప్రతి పిల్లలకు తమ తండ్రి హీరోనే. బ్రాహ్మణి మాత్రం హీరో నటసింహ నందమూరి బాలకృష్ణకి కూతురిగా పుట్టింది. తన సాధించిన విజయాలు అనేకం ఉన్నాయి. కానీ ఏనాడు మీడియా ముందుకు వచ్చి సినిమాల గురించి, తండ్రి గురించి పెద్దగా మాట్లాడరు. రీసెంట్ గా ఫాదర్స్ డే సందర్భంగా నాన్నపై ప్రసంశల వర్షం కురిపించింది. “నాన్న లాంటి సృజనాత్మక నటుడిని నేను ఇంకెక్కడా చూడలేదు. నాన్న ఒక స్క్రిప్టును నమ్మరంటే ఇంకేమీ ఆలోచించరు. ఏమాత్రం రాజీ లేకుండా ఆ సినిమా చేయడానికి.. ఆ పాత్రలో ఒదిగిపోవడానికి ప్రయత్నిస్తారు.” అని వివరించింది.
బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కోసం తామందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు బ్రాహ్మణి చెప్పింది. నటన గురించే కాకుండా నేతగా ఎలా కష్టపడుతారో వివరించింది. “నాన్నకి సినిమాలతో పాటు రాజకీయాలంటే కూడా ఎంతో కమిట్మెంట్ ఉంది. ప్రజలకు సేవ చేయాలన్న తపన ఎక్కువ.” అని బ్రాహ్మణి పేర్కొంది. ఇక రియల్ లైఫ్ లో తన తండ్రి నటించడానికి ఇష్టపడరని తెలిపింది. ఫాదర్స్ డే రోజున ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ నందమూరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. తండ్రి గురుంచి కుమార్తె ఎంత బాగా మాట్లాడిందో అని ఆనందపడుతున్నారు.