ఇది సినిమాలా కాదు.. తాతగారి జీవితాన్ని చూసినట్టుంది : నారా బ్రాహ్మణి

  • January 10, 2019 / 11:41 AM IST

క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ నటించి… నిర్మించిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ నుండీ మొదటి భాగమైన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా జనవరి 9 న (నిన్న) ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మొదటి షో నుండే.. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో బాలకృష్ణ తన కుటుంబసభ్యులతో కలిసి వీక్షించారు.

అటు తరువాత మీడియాతో మాట్లాడారు నారా బ్రాహ్మణి. ఆమె మాట్లాడుతూ.. “నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నాన్న గారు.. అచ్చం తాతగారిలా కనిపించడంతో పాటు .. ఆయన పాత్రలో ఒదిగిపోయారు. తాతగారు ఎప్పుడూ ప్రజాసేవ గురించి ఆలోచించేవారు, కుటుంబంతో చాలా తక్కువ సమయం గడిపారు. మా నాయనమ్మ బసవతారకం గారు నేను పుట్టకముందే చనిపోయారు. ఆమె చాలా మంచి వ్యక్తి.. అలాగే ఎంతో గొప్ప వ్యక్తి కూడా. తాతగారికి ఫిల్మ్ కెరీర్ తో పాటు పాలిటిక్స్ లో కూడా ఆమె చాలా సపోర్టు చేసేవారు. ఈ చిత్రంలో అందరి నటీనటులు.. బాగా నటించారు. టెక్నికల్ టీం కష్టమంతా స్క్రీన్ పైన కనిపించింది. ఈ చిత్రం కచ్చితంగా ఘానవిజయం నమోదు చేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఈ చిత్రం.. ఒక సినిమాలా కాకుండా… నిజంగా తాతగారి జీవితాన్ని చూసినట్టు అనిపించింది. నాన్నగారి ప్రొడక్షన్ లో మొదటి సినిమా ఇది. ఈ చిత్రంతో… దీనికి పూర్తి న్యాయం జరిగింది” అంటూ చెప్పుకొచ్చారు నారా బ్రాహ్మణి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus