నారా రోహిత్ కి అగ్ని పరీక్ష !!

Ad not loaded.

నారా చంద్రబాబునాయుడు తమ్ముడి తనయుడు నారా రోహిత్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం “సావిత్రి” ఏప్రిల్ 1న విడులవుతోంది. “తుంటరి” విడుదలైన రెండు వారాల వ్యవధిలోనే “సావిత్రి” రిలీజ్ అవుతుండడం గమనార్హం. “బాణం”తో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన నారా రోహిత్.. ఆ తర్వాత “సోలో, ఒక్కడినే, ప్రతినిధి, రౌడి ఫెలో, అసుర” వంటి చిత్రాల్లో నటించాడు.
వీటిలో “సోలో” ఒక్కటే సోసో అనిపించుకోగా.. మిగతా సినిమాలన్నీ నిరాశపరిచాయి. ఈ నేపధ్యంలో.. “సావిత్రి” సినిమా ఫలితం రోహిత్ కెరీర్ కి చాలా కీలకం కానుంది. “ప్రేమ-ఇష్క్-కాదల్” చిత్రంతో దర్శకుడిగా పరిచయమయిన పవన్ సాదినేని దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నందిత హీరోయిన్. ట్రైలర్స్, సాంగ్ టీజర్స్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం ఏ మేరకు నారా వారి కుర్రాడికి హెల్ప్ అవుతుందో వేచి చూడాలి !!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus