Nara Rohith Engagement Photos: ఘనంగా నారా రోహిత్ నిశ్చితార్థం… ఫోటోలు వైరల్.!

బాణం సినిమా తొలితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ (Nara Rohith) ఆ తర్వాత సోలో , ప్రతినిధి, రౌడీ ఫెలో, జ్యో అచ్యుతానంద, అప్పట్లో ఒకడు ఉండేవాడు ‘ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. అయితే 2019 నుండీ ఇతను సినిమాలకు దూరమయ్యాడు. అందుకు గల కారణాలు కూడా అందరికీ తెలిసిందే. మొత్తానికి ప్రతినిధి 2 (Prathinidhi 2) సినిమాతో అతను రీ ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే సుందరకాండ మూవీతో కూడా అతను ప్రేక్షకులను పలకరించనున్నాడు.

Nara Rohith Engagement Photos

ఇదిలా ఉండగా త్వరలో నారా రోహిత్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ‘ప్రతినిధి 2’ హీరోయిన్ సిరిలెల్లాను నారా రోహిత్ వివాహమాడబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌ అనే స్టార్ హోటల్లో ఘనంగా జరిగింది. ఉదయం 10.45కి రోహిత్‌-ఈ నిశ్చితార్థ వేడుక జరిగినట్టు తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఇక వీరి వివాహం డిసెంబర్‌ 15న జరగబోతుంది అని సమాచారం.

ఇక సిరిలెల్లా- నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్ వేడుకకు నారా, నందమూరి కుటుంబాలు హాజరయ్యారు. అలాగే అమ్మాయి బంధువులు, కొందరు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ నిశ్చితార్థం వేడుక జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, ఇంకా నారావారి ఫ్యామిలీ, అలాగే నందమూరి కుటుంబసభ్యులు ఈ వేడుకలో సందడి చేసిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఒకసారి చూడండి:

 ఆ విషయంలో అస్సలు రాజీ పడని బాలయ్య జూనియర్ ఎన్టీఆర్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus