టాలీవుడ్ హీరో నారా రోహిత్, శిరీష(సిరులెల్ల).. ల వివాహం నిన్న అంటే అక్టోబర్ 30న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.ఇటీవల భారీ వర్షాలు పడటంతో పెళ్లిని చాలా సింపుల్ గా ప్లాన్ చేశారు. ఎక్కువ శాతం రాజకీయ నాయకులు హాజరవ్వడం వల్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. దీంతో సినీ సెలబ్రిటీలను ఎక్కువ మందిని ఆహ్వానించలేదు.నారా రోహిత్ కు అత్యంత సన్నిహితులు అయిన హీరోలు శ్రీవిష్ణు,మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్..లు అలాగే బాలయ్య కుటుంబం మాత్రమే హాజరైనట్టు తెలుస్తుంది.
ఈ వేడుకలో ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు అలాగే వారి కొడుకు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి వంటి వారు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వారు నూతన వధూవరులను ఆశీర్వదించి తమ బెస్ట్ విషెస్ ను తెలియజేశారు. చంద్రబాబు దంపతులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించడం జరిగింది. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి: