Naresh, Pavitra: పశ్చిమ గోదావరి జిల్లాలో సందడి చేసిన నరేష్- పవిత్ర!

సీనియర్ నటుడు నరేష్, పవిత్ర ల రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఈ జంట ఎక్కడో చోటున హైలెట్ అవుతూనే ఉంటుంది. అది పెళ్ళిలో అయినా.. కృష్ణ, ఇందిరా దేవి గారు చనిపోయినప్పుడు నివాళులు అర్పించడానికి చేసిన వేడుకల్లో అయినా ఎక్కడ చూసినా ఈ జంట హాట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. మీడియా కూడా ఎక్కువగా వీళ్ళ పైనే ఫోకస్ పెడుతూ ఉంటుంది.

ఈ మధ్య కాలంలో వీరిద్దరినీ జంటగా పెట్టి సినిమాలు చేసే వరకు వెళ్ళింది వ్యవహారం. ఆల్రెడీ అలీ ‘అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి’ అనే సినిమాలో ఈ జంటను హైలెట్ చేస్తూ కొన్ని ట్రాక్ లు రాయించాడు. అలాగే నిర్మాత యం.యస్.రాజు ఈ జంటని హైలెట్ చేస్తూ ‘మళ్ళీ పెళ్ళి’ అనే సినిమా కూడా తీసేస్తున్నాడు. ఈ సినిమాని తమ పర్సనల్ లైఫ్ కు ముడిపెడుతూ ప్రమోషన్ చేసుకుంది ఈ జంట.

ఇదిలా ఉండగా.. ఇటీవల నరేష్ (Naresh) – పవిత్ర లు పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుపాడులో సందడి చేశారు. ఆదివారం నాడు ఆ గ్రామంలో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకకు ఈ జంట హాజరైనట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అటు తర్వాత అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు నరేష్ – పవిత్ర. పెళ్ళైతే చేసుకోలేదు కానీ ఈ జంట సహజీవనం కొనసాగిస్తూనే ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus