Naresh, Pavitra Lokesh: వేదికపై రెచ్చిపోయి మరి డాన్స్ చేసిన నరేష్ పవిత్ర లోకేష్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతున్నటువంటి వారిలో నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్ జంట గురించి చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ పలు తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే ఒకరి ప్రేమలో మరొకరు పడ్డారు ప్రస్తుతం ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ లో ఉన్నారనే విషయం తెలియడంతో వీరిద్దరి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి చేసినటువంటి హంగామా అందరికీ తెలిసిందే. ఇలా తరచు ఏదో ఒక వివాదం ద్వారా నరేష్ పవిత్ర లోకేష్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇకపోతే తాజాగా వీరిద్దరూ బుల్లితెర కార్యక్రమంలో సందడి చేసిన సంగతి తెలిసిందే. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రత్యేకమైన ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు కూడా హాజరై సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా వేదికపై మాస్టారు మాస్టారు అంటూ ఈ పాటకు రొమాంటిక్ డాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. ప్రస్తుతం వీరి పెర్ఫార్మెన్స్ కి సంబంధించినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా వీరిద్దరూ వేదికపై కాస్త రొమాంటిక్ గా కనిపించడంతో వీరి వ్యవహారం మరోసారి వైరల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవిత్ర లోకేష్ నరేష్ గురించి ఓ విషయాన్ని వెల్లడించారు.

తాను నరేష్ (Naresh) గారిని ముద్దుగా రాయా అని పిలుస్తాను అంటూ నరేష్ ముద్దు పేరును బయట పెట్టారు. ఇకపోతే నరేష్ కూడా పవిత్ర లోకేష్ ను ముద్దు పేరుతోనే పిలుస్తాను అంటూ ఈయన మళ్ళీ పెళ్లి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో రివిల్ చేశారు. నరేష్ పవిత్ర లొకేషన్ ముందుగా అమ్ములు అంటూ పిలుస్తానని ఈయన గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ నిక్ నేమ్స్ ద్వారా ఒకరినొకరు పిలుచుకుంటారని తెలుస్తోంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus