టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పాపులారీటీ పొందిన సెలబ్రిటీలలో పవిత్ర లోకేష్ నరేష్ జంట ఒకటి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని తెలిసినప్పటి నుంచి వీరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇద్దరు జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వీరిద్దరు బుల్లితెరపై ప్రసారమవుతున్న సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నరేష్ పవిత్ర లోకేష్ పెద్ద ఎత్తున సందడి చేశారు.అంతేకాకుండా నరేష్ పవిత్ర లోకేష్ వ్యక్తిగత జీవితం గురించి వీరి రిలేషన్షిప్ స్టేటస్ గురించి కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు. నరేష్ పవిత్ర లొకేషన్ ముద్దుగా ఏమని పిలుస్తారనే విషయాల గురించి తెలియజేశారు. తాను పవిత్ర లొకేషన్ ముందుగా అమ్ములు అని పిలుచుకుంటానని తెలిపారు. ఇంకా ప్రేమ ఎక్కువైతే అమ్ము అని పిలుస్తానని ఇంకా ఎక్కువ ప్రేమ అయితే ఏమని పిలుస్తానో తెలుసా అంటూ సస్పెన్స్ పెట్టి వద్దులే అని వదిలేశాడు.
ఇలా పవిత్ర లోకేష్ ను తాను ముద్దుగా ఏమని పిలుస్తారో ఈ సందర్భంగా నరేష్ బయట పెట్టారు. అంతేకాకుండా ఓంకార్ నరేష్ ను ప్రశ్నిస్తూ మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నరేష్ సమాధానం చెబుతూ.. ఆకాశం మీద పడిన భూమి బద్దలైన ఎప్పటికీ మేము ఇలాగే కలిసి ఉంటామని తెలియజేశారు. నరేష్ ఇలా చెప్పడంతో పవిత్ర ఎంతో సంతోషం వ్యక్తం చేసింది.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవిత్ర లోకేష్ నరేష్ (Naresh) ఇద్దరు ఆటపాటలతో డాన్సులు చేయడమే కాకుండా వేదికపైనే ఒకరి పై మరొకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. ఏది ఏమైనా ఇలా ఈ కార్యక్రమంలో పవిత్ర లోకేష్ నరేష్ రొమాన్స్ మరో లెవల్లో చేశారనే చెప్పాలి. ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో పలువురు నేటిజన్స్ వీరి రిలేషన్ పై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. లేటు వయసులో ఈ ఘాటు ప్రేమలు ఏంట్రా బాబు అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.