అల్లరి నరేశ్.. పేరులోనే కామెడీని పెట్టుకున్న హీరో. అయితే అతని నుండి ఇటీవల కాలంలో వినోదాత్మక చిత్రాలు రావడం లేదు. కారణమేంటి అనేది తెలియదు కానీ.. ఆయన కామెడీని, కామెడీ టైమింగ్‌ని తెలుగు ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. ‘నాంది’ సినిమా సమయంలో ఈ విషయం అడిగితే.. ప్రయోగం చేద్దామని ఈ సినిమా చేస్తున్నా అని చెబుతూనే.. కామెడీ సినిమా చేసేవాళ్లు ఇప్పుడెవరు ఉన్నారు అని తిరిగి అడిగారాయన. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రశ్నే వేశారు.
‘‘కామెడీ రాసేవాళ్లు ఎవరున్నారు? తీసేవాళ్లు ఎవరున్నారు? కామెడీ రాయడం చాలా కష్టం’’ అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో కామెడీ సినిమాలు, రచయితలు, దర్శకుల పరిస్థితిని వివరించారు. అంటే నటించడానికి హీరోలు, నటులూ ఉన్నా.. అలాంటి సినిమాలు రాసేవాళ్లే లేరు అనేది ఆయన మాట. అప్పట్లో నరేశ్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ దగ్గర పదుల సంఖ్యలో రచయితలు ఉండేవాళ్లట. అందరూ కలసి ప్రాజెక్ట్ చేసేవాళ్లు. అందరిలో మా పేరు కనిపిస్తే చాలనుకునేవాళ్లట.
అయితే ఇప్పుడు ఎవరికి వాళ్లు పేరు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అని చెప్పారు (Naresh) నరేశ్. పైగా ఇప్పుడు కామెడీ సినిమాలు చాలా పరిమితుల మధ్య చేయాల్సి వస్తోంది అని క్లారిటీ ఇచ్చారు. ‘కితకితలు’ సినిమా తరహా ప్రాజెక్ట్‌ను ఇప్పుడు తీస్తే బాడీ షేమింగ్ అని అంటారు అంటూ ప్రస్తుతం సినిమాను చూసే విధానాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. స్వచ్ఛమైన కామెడీతో కథలు రాయడం ఇప్పుడు సాధ్యం కావడం లేదు అని తన బాధను కూడా చెప్పారాయన.
అయితే పూర్తిగా కామెడీ సినిమాలు మానేస్తారా అంటే.. అలా ఏమీ లేదు, ‘ఉగ్రం’ తర్వాత ఓ కామెడీ సినిమా చేస్తున్నా అని చెప్పారు. కామెడీ పాత్రల నుండి నరేశ్ బయటకు రావాలనుకుంటున్న సమయంలో ‘మహర్షి’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ వెంటనే ‘నాంది’ చేశాడు. రచయితలు అతని గురించి మరింత కొత్తగా చూడటం అప్పుడే మొదలుపెట్టారు. ‘మారేడుమిల్లి ప్రజానీకం’ అలా వచ్చిందే. ఇప్పుడు ‘ఉగ్రం’ వస్తోంది.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా