శర్వానంద్ హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. 2017 లో వచ్చిన ‘మహానుభావుడు’ తర్వాత శర్వానంద్ ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు. ‘ఒకే ఒక జీవితం’ పర్వాలేదు అనిపించినా.. ‘మనమే’ యావరేజ్ గా నడిచినా ఆశించిన బ్లాక్ బస్టర్ అయితే దక్కలేదు. దీంతో కొంత గ్యాప్ తర్వాత కలిసొచ్చిన సంక్రాంతి సీజన్ కి ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు శర్వానంద్. ‘సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. టీజర్, ట్రైలర్స్ వంటివి పెద్ద హోప్స్ అయితే ఇవ్వలేదు. కానీ దర్శకుడి పై ఉన్న నమ్మకం.. శర్వానంద్ సంక్రాంతి ట్రాక్ రికార్డు పై ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా. ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు వీక్షించారు. అనంతరం తమ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకున్నారు.

వారి టాక్ ప్రకారం.. సినిమా రన్ టైం 2 గంటల 25 నిమిషాలు ఉందట. సినిమా స్టార్టింగ్ నుండి నాన్ స్టాప్ గా పంచ్ డైలాగులతో సాగుతుందట. హీరో శర్వానంద్ 2 రకాల షేడ్స్ కలిగిన పాత్రలో మెప్పించారని చెబుతున్నారు. ‘సామజవరగమన’ సినిమాలో లానే ఈ సినిమాలో కూడా సీనియర్ నరేష్ కామెడీ హైలెట్ అయ్యిందట. సత్య, వెన్నెల కిషోర్, సుదర్శన్ వంటి వాళ్ళ కామెడీ ఆకట్టుకునే విధంగా ఉంది అంటున్నారు.
అలాగే ఈ సినిమాలో కూడా ఓ సెన్సిటివ్ పాయింట్ ని టచ్ చేశారట. క్లైమాక్స్ ఈ సినిమాకి మరో హైలెట్ అంటున్నారు.శ్రీవిష్ణు కేమియో కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటున్నారు. చూడాలి మరి ప్రీమియర్స్ తో ఈ సినిమాకి ఎలాంటి టాక్ వస్తుందో.
