తేజ మరో హీరో కోసం చూస్తున్నాడా..?

  • April 5, 2021 / 01:34 PM IST

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, నార్నే శ్రీనివాసరావు కుమారుడు.. నార్నే నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. దర్శకుడు తేజ ‘చిత్రం’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిస్తోన్న ‘చిత్రం 1.1’ సినిమాతో నార్నే నితిన్ చంద్రని హీరోగా పరిచయం చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయిందని సమాచారం. అసలు విషయంలోకి వస్తే.. దర్శకుడు తేజ కొత్త హీరోని పరిచయం చేస్తూ ‘చిత్రం 1.1’ సినిమా తీయాలనుకున్నారు.

ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే. ఈ ప్రాజెక్ట్ లోని ఎన్టీఆర్ బావమరిదిని సెట్ చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. నిర్మాణంలో కొంత భాగాన్ని నార్నే శ్రీనివాసరావు భరించేలా బేరాలు మొదలుపెట్టారు. కానీ దర్శకుడు తేజ అడిగిన మొత్తం చాలా ఎక్కువ కావడంతో హీరో సైడ్ నుండి డ్రాప్ అయిపోయినట్లు తెలుస్తోంది. తేజ అడిగినంత ఎక్కువ ఖర్చుని భరించి వేరే బ్యానర్ లో లాంచ్ చేయడం కంటే.. తామే సొంతంగా ప్రొడ్యూస్ చేసుకోవడం బెటర్ ని నార్నే ఫ్యామిలీ భావిస్తోంది.

దీంతో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తేజ మరో హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఆయన అడిగిన మొత్తాన్ని భరించే హీరో ఎవరూ దొరకకపోతే.. తన కొడుకునే హీరోగా పరిచయం చేయాలని అనుకుంటున్నారట తేజ. ఇదిలా ఉండగా.. ఈ సినిమా హీరోతో పాటు మరో 45 మంది కొత్తవాళ్లను పరిచయం చేయబోతున్నాడు తేజ. ఈ సినిమాతో ఆర్పీ పట్నాయక్ మళ్లీ మ్యూజిక్ డైరెక్టర్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus