Nataraj Master: పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చిన నటరాజ్ మాస్టర్ భార్య ..!
- November 18, 2021 / 05:05 PM ISTByFilmy Focus
‘బిగ్ బాస్ సీజన్ 5’ కి 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సీనియర్ కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ అందరికీ సుపరిచితమే. ‘ఆట’ ద్వారా పాపులర్ అయిన ఇతను గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కొరియోగ్రాఫర్ గా పనిచేసారు. టాలీవుడ్లో 20 ఏళ్ళకి పైగా కొనసాగిన నటరాజ్ మాస్టర్ కొన్నాళ్ళు కనుమరుగైపోయి ‘బిగ్ బాస్5’ తో దర్శనమిచ్చాడు. ఈయన ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఇతని భార్య 7 నెలల గర్భవతి అన్న సంగతి తెలిసిందే.
నాలుగు వారాల పాటు హౌస్ లో కొనసాగిన నటరాజ్ మాస్టర్… ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యాడు. ఇక తాజాగా ఇతని భార్య నీతూకి డెలివరీ అయ్యింది. పండంటి ఆడపిల్లకి ఆమె జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నటరాజ్ మాస్టర్.. సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.నతనకి ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్నట్టు నటరాజ్ మాస్టర్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.అతను కోరుకున్నట్టే అమ్మాయి పుట్టిందని చెప్పి మురిసిపోతూ ఎమోషనల్ అయ్యాడు. బుధవారం నాడు అర్థరాత్రి మరో ‘బిగ్ బాస్5’ కంటెస్టెంట్ లోబోతో కలిసి ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన నటరాజ్ ఈ విషయాన్ని తెలిపి..

దేవుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఏమీ ఇవ్వకపోయినా.. బయట మాత్రం తాను కోరుకున్నట్టు పండండి బిడ్డని ఇచ్చాడు అంటూ నటరాజ్ ఆనందం వ్యక్తం చేసాడు. అలాగే తన అభిమానులకు థ్యాంక్స్ చెప్పి… తనకి, తన బిడ్డకి అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నట్టు కూడా తెలిపారు.
1

2

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
















