సినీ దిగ్గజాలకు జాతీయ అవార్డులు

భారతీయ చిత్ర పరిశ్రమకు విశేష సేవలను అందించిన నటులు, దర్శకులు, నిర్మాతలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవార్డులతో సత్కరించనుంది. 2012 , 2013 సంవత్సరాలకు ఎన్టీఆర్‌, రఘుపతి వెంకయ్య, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డులను మంగళవారం సాయంత్రం ప్రకటించింది. అవార్డు గ్రహీతల వివరాలను సినీ హీరోలు నందమూరి బాలకృష్ణ, మురళీ మోహన్‌ ప్రకటించారు. అవార్డు గ్రహీతలు వీరే..

– ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు 2012 : ఎస్పీ బాలసుబ్రమణ్యం

– ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు 2013 : హేమమాలిని

– బీఎన్‌రెడ్డి అవార్డు 2012 : సింగీతం శ్రీనివాసరావు
– బీఎన్‌రెడ్డి అవార్డు 2013 : కోదండ రామిరెడ్డి
– రఘుపతి వెంకయ్య అవార్డు 2012 : కోడి రామకృష్ణ
– రఘుపతి వెంకయ్య అవార్డు 2013 : వాణిశ్రీ
– నాగిరెడ్డి- చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు 2012 : డి.సురేశ్‌బాబు
– నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు 2013 : దిల్‌రాజు


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus