National Awards: అవార్డులన్ని మెగా కాంపౌండ్ లోనే..!

69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో మెగా ఫ్యామిలీ హవా నడిచింది. దాదాపు అన్ని అవార్డులు మెగా ఫామిలీ కి సంబందించిన హీరోలకు రావడం విశేషం. 2023 జాతీయ అవార్డ్స్ లో మెగా హీరో రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆర్ అవార్డులను దక్కించుకుంది. ఈ సినిమాకు గాను.. బెస్ట్‌ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్‌ సింగర్‌ గా కాల భైరవ, బెస్ట్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్ గా కీరవాణి, బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ గా కింగ్ సోలోమన్‌, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్, బెస్ట్ స్పెషల్ ఎఫక్ట్ విభాగంలో శ్రీనివాస్ మోహన్ ను జాతీయ అవార్డులు దక్కాయి.

ఇక 70 ఏళ్ళ సినీ చరిత్రను తిరగరాస్తూ మెగా హీరో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నాడు. పుష్ప సినిమాలో తన అద్భుతమైన నటనకుగాను ఈ ఆ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్స్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్. మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన మొదటి సినిమా ఉప్పెనకు ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డు దక్కింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించారు.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడమే కాకుండా.. రూ.100 కోట్ల గ్రస్స్ కలెక్షన్స్ ను రాబట్టింది. వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో వచ్చిన కొండపోలం సినిమాకు కూడా జాతీయ అవార్డు దక్కింది. ఈ సినిమాలో ఉత్త లిరిక్స్ విభాగంలో గేయ రచయిత చంద్రబోస్ అవార్డును అందుకున్నాడు. క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా జాతీయ అవార్డు టీమ్ కు జాతీయ అవార్డు (National Awards) తెచ్చిపెట్టింది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus