ఆసక్తిని రేకెత్తిస్తున్న నాట్యం సినిమా..!

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు రిలీజ్ చేస్తున్న సినిమా నాట్యం. జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సినిమా అఫీషియల్ టీజర్ లాంఛ్ అయ్యింది. ప్రముఖ నాట్య కళాకారిణి అయిన సంధ్యారాజు హీరోయిన్ గా నటించిన సినిమానే నాట్యం. కొత్తదర్శకుడు రేవంత్ కోరుకొండ తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ ని ఎన్టీఆర్ విడుదల చేయడంతో నెటిజన్స్ లో ఆసక్తినిరేపింది. ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది ఈ టీజర్.

శాస్త్రీయ నృత్యమైన కూచిపూడి ప్రధానంగా ఈ సినిమా ఉండబోతోంది. అంతేకాదు, టీజర్ లోనే సినిమా ఎలా ఉండబోతోంది అనేది చెప్పేశారు. టీజర్ చూస్తుంటే సంధ్యారాజు నటన ఎంతో అద్భుతంగా ఉంది. తెరకు కొత్తైనా స్వతహాగా నర్తకి కావడంతో చక్కని హావభావాలతో నాట్యం సినిమాకి ప్రాణం పోశారనే చెప్పాలి. డైరెక్టర్ కె. విశ్వనాథ్ సప్తపది సినిమా, సాగరసంగమం సినిమాలని గుర్తు చేసేలా ఉంది ఈ టీజర్. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం టీజర్ లో హైలెట్ గా నిలిచింది.

అంతేకాదు, ఈ సినిమా ఒకవైపు పీరియాడికల్ స్టోరీలాగా కనిపిస్తున్నా, దీనికి మోడ్రన్ టచ్ కూడా ఇచ్చారు. ఇక టీజర్లో స్టార్ కాస్టింగ్ కూడా రివీల్ చేసేశారు. కమల్ కామరాజు, రోహిత్ బెహల్, భానుప్రియలు ప్రధానమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు. అంతేకాదు, ఒక క్లాసికల్ సినిమాలగా ఈ టీజర్ ని బట్టీ చూస్తే అర్ధం అవుతోంది. రేవంత్ కోరుకొండ ఈ సినిమాకి డైరెక్టర్ గానే కాకుండా, స్క్రిప్ట్ రైటర్ గా, కెమెరామాన్ అండ్ ఎడిటర్ గా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. మరి ఈ సినిమా కమల్ హాసన్ సాగరసంగమం అంత పెద్ద హిట్ కొడుతుందా లేదా అనేది చూడాలి.


వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus