ఇప్పటికైనా నవదీప్‌కి ఒక క్లారిటీ వచ్చినట్లుంది

నవదీప్‌.. సినిమాలతో అందరికీ తెలిశాడు. కాంట్రవర్సీలతో ఇంకా చాలామందికి తెలిశాడు. అంతగా అతని చుట్టూ కాంట్రవర్శీలు తిరుగుతూ ఉంటాయి. మధ్యమధ్యలో కాంట్రవర్శీ సినిమాల్లో నటిస్తుంటాడు కూడా. అయితే సినిమాల్లో ఆశించినంత పేరు తెచ్చుకోలేకపోయాడనే చెప్పాలి. నటించే టాలెంట్‌ ఉన్నా, హీరో ఎలిమెంట్స్‌ ఉన్నా… రాణించలేకపోయాడు. కారణాలేమైనా.. అనుకున్న ఇమేజీ రాలేదు. ఈ క్రమంలో కొన్ని తప్పుడు నిర్ణయాలతో, చెత్త సినిమాలు, గుర్తింపు లేని పాత్రలు ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు అలాంటి నిర్ణయాల పట్ల చింతిస్తున్నాడు.

నవదీప్‌ ఇటీవల కాలంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. టీవీ షోలకు జడ్జిగా వచ్చాడు. మంచు విష్ణు ‘మోసగాళ్లు’లో కీలక పాత్ర దక్కింది. మరోవైపు విజయేంద్ర ప్రసాద్‌ తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్ర దక్కించుకున్నాడు. దీంతో కెరీర్‌ సరైన దారిలోనే వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఏంటి సంగతి… మీలో ఈ మార్పునకు కారణమేంటి అని ఇటీవల నవదీప్‌ను కదిలిస్తే.. తన కెరీర్‌ గురించి వివరంగా మాట్లాడాడు. ‘‘సినిమాల ఎంపికలో మొదటి నుండీ కన్ఫ్యూజన్‌ ఉండేది.

మన మనసుకు నచ్చింది చేయాలా? లేక మన దగ్గరికి వచ్చిన సినిమాలు చేయాలా.. అనే గందరగోళం నాకు ఉండేది. సరైన సక్సెస్‌ లేనప్పుడే నటులకే ఇలాంటి పరిస్థితి వస్తుంటుంది. నాకూ అంతే. ఇలాంటి సమయంలో పెద్ద నిర్మాతలు, దర్శకులు స్క్రిప్ట్‌లు తీసుకొచ్చినప్పుడు, అవి అంతగా నాకు నచ్చకున్నా.. నో చెప్పలేకపోయే వాడిని. దాంతో చాలా ఫ్లాప్‌లు చూశా. అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం కనుకున్నా. ‘షూటింగ్‌ లేకపోతే డబ్బులు తక్కువ ఖర్చుపెట్టి వేరే పనులు చేసుకోవాలి. అంతే కానీ, పిచ్చి పిచ్చిగా చేయొద్దు అని నిర్ణయం తీసుకున్నా’’ అని చెప్పాడు నవదీప్‌.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus