Navdeep: ప్రస్తుతానికి నేను రెడీగా లేను: నవదీప్

నవదీప్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు. రీసెంట్ టైమ్స్ లో నవదీప్ నటించిన ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. 40 ఏళ్లు దగ్గర పడుతున్న కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ని గడుపుతున్నాడు ఈ హీరో. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, రిలేషన్స్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లిపై నవదీప్ మాట్లాడుతూ..

పెళ్లి జరిగే టైంలో అదే జరుగుతుంది. నేను ప్రస్తుతానికి రెడీగా లేను. నేను రెడీ అయినప్పుడు చేసుకుంటా. చేసుకోబోయే అమ్మాయిలకు క్వాలిటీస్ గురించి నేను చెప్పలేను. ఎందుకంటే ముందు నేను రెడీగా లేను కదా. నా లోపల ఉన్న వాడికి ఏం కావాలో ఇంకా తెలియదు. నేనేంటో ముందు నాకు తెలిస్తే కదా, మరొకరిని తెచ్చి చంకలో పెట్టుకోవడానికి. వయసు అయిందని, ఎవరో అడిగారని పెళ్లిళ్లు చేసుకోవద్దు” అంటూ చెప్పుకొచ్చాడు నవదీప్.

అంతేకాకుండా వైవాహిక వ్యవస్థ పై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వివాహ వ్యవస్థలో లోపం లేదని, దాని అర్థం చేసుకోవడంలోనే లోపాలు ఉన్నాయని అన్నాడు నవదీప్. “వివాహ వ్యవస్థ మంచిదే. కాకపోతే దాని అర్థం చేసుకోవడంలో చాలా మంది తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు కాలం మారింది. పెళ్లి ఎందుకు చేసుకుంటున్నామని అంశంపై యూత్ కి ఓ క్లారిటీ ఉండాలి. అప్పుడే పెళ్లి చేసుకోవాలి వైవాహిక వ్యవస్థలో లోపం లేదు.

కాకపోతే నా (Navdeep) పరిస్థితి వేరు” అంటూ వైవాహిక వ్యవస్థ గురించి చెప్పాడు. తన సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలని ముందు వెనుక ఆలోచించకుండా చాలా సినిమాలు చేశా. అవి కాస్త దెబ్బ కొట్టాయి. అందుకే ప్రెజెంట్ ఆలోచించి సినిమాలు చేయాలి” అని అనుకుంటున్నట్లు తెలిపాడు. లాక్‌డౌన్ టైమ్‌లో తనకు బ్రేకప్ అయ్యిందని, దాని నుంచి బయటపడేందుకు థెరపీకి కూడా వెళ్లానని చెప్పాడు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus