Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » నవీన్ చంద్ర హీరోగా సర్వoత్ రామ్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 9 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం!

నవీన్ చంద్ర హీరోగా సర్వoత్ రామ్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 9 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం!

  • January 28, 2021 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నవీన్ చంద్ర హీరోగా సర్వoత్ రామ్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 9 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం!

సర్వoత్ రామ్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 9 చిత్రం గురువారం (జనవరి 28) పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ నటి మధుబాల ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ కొట్టగా.. మూవీ స్క్రిప్ట్‌ను సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చిత్ర యూనిట్‌కు అందచేశారు. రాశి మూవీస్ అధినేత నరసింహారావు కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. చిత్ర దర్శకుడు అరవింద్ మొదటి షాట్‌కు యాక్షన్ చెప్పారు.

ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘అరవింద్‌గారు చెప్పిన ఈ థ్రిల్లర్ నాకు బాగా నచ్చింది. మధుబాలగారితో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మంచి థ్రిల్లర్‌లో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సర్వoత్ రామ్ క్రియేషన్స్‌లో రాబోతున్న మరో మంచి సినిమా ఇది. మరిన్ని మంచి చిత్రాల్లో నటించడానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి..’’ అని తెలిపారు.

మధుబాల మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. డైరెక్టర్ అరవింద్ నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఈ సినిమాలో డీజీపీగా పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాను. చాలా కాలం తరువాత మంచి కథతో తెలుగులో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది..’’ అన్నారు.

హీరోయిన్ స్మృతి వెంకట్ మాట్లాడుతూ.. ‘‘ఈ పాత్రకు నన్ను సెలక్ట్ చేసినందుకు సర్వoత్ రామ్ క్రియేషన్స్‌ నిర్మాతగారికి, దర్శకుడికి ధన్యవాదాలు. మధుబాలగారితో నటించడం ఇట్స్ మై డ్రీమ్. సినిమా బ్యానర్ లాగే కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను..’’ అని తెలిపారు.

డైరెక్టర్ అరవింద్ మాట్లాడుతూ.. ‘‘సర్వoత్ రామ్ క్రియేషన్స్‌లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. మధుబాలగారు ఈ మూవీలో చాలా కీలక పాత్రలో నటిస్తున్నారు. నవీన్ చంద్రగారు మా స్క్రిప్ట్ నచ్చి ఈ మూవీ ఒప్పుకున్నారు. నిర్మాత నాపై నమ్మకం ఉంచినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరినీ అలరించే విధంగా ఈ సినిమా ఉంటుంది..’’ అన్నారు.

నిర్మాత రామాంజనేయులు జవ్వాజి మాట్లాడుతూ.. ‘‘ఈ కథ విని వెంటనే నవీన్ చంద్ర ఒప్పుకున్నారు. ఆయన నిర్మాతల హీరో అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ అరవింద్‌గారు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ కథను రాసుకున్నారు. మధుబాలగారు ఈ సినిమాలో నటించడం మరో పెద్ద ఎస్సెట్. ఫిబ్రవరి నుండి చెన్నైలో షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్‌లో ఎండ్ చేస్తాము. ఒకే షెడ్యూల్‌లో సినిమాను అనుకున్న టైమ్‌లో పూర్తి చెయ్యడానికి ప్లాన్ చేశాము. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం మరో హైలెట్ కానుంది’’ అని అన్నారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravidh
  • #Madhubala
  • #Naveen Chandra
  • #Smruthi Venkat

Also Read

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

trending news

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

21 mins ago
Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

2 hours ago
Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

4 hours ago
Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

4 hours ago
R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

5 hours ago

latest news

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

3 hours ago
Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

5 hours ago
Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

23 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

23 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version