Naveen Polishetty: నాకంటే ఆ ఇద్దరు హీరోయిన్లు పొడుగ్గా లేరు.. అసలు మేటర్ అది : నవీన్ పోలిశెట్టి

న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ‘యువీ క్రియేష‌న్స్’ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌ లు నిర్మించిన ఈ చిత్రాన్ని ‘రా రా క్రిష్నయ్య’ ఫేమ్ మ‌హేష్ బాబు.పి డైరెక్ట్ చేశాడు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది. టీజర్, ట్రైలర్లు బాగున్నాయి. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంటుంది అనే భరోసాని కలిగించాయి. రథన్ సంగీతంలో రూపొందిన పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రం పోస్టర్స్ రిలీజ్ అయినప్పటి నుండి అనుష్క, (Naveen Polishetty) నవీన్ పోలిశెట్టి పెయిర్ పై సెటైర్లు పడ్డాయి. మరీ ముఖ్యంగా హీరో నవీన్ పోలిశెట్టి కంటే కూడా హీరోయిన్ అనుష్క పొడుగ్గా కనిపించిందని అంటున్నారు. నవీన్ గత చిత్రం ‘జాతి రత్నాలు’ లో కూడా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పొడుగ్గా కనిపిస్తుంది. దీని గురించి నవీన్ పోలిశెట్టిని ప్రశ్నించగా.. ‘ఆ ఇద్దరు హీరోయిన్లు నాకంటే పొడుగ్గా ఏమీ లేరు. హీల్స్ వేయడం వల్ల నాకంటే పొడుగ్గా కనిపిస్తున్నారు అంతే.

ఇక ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టిలో మా పెయిర్ ఎలా ఉంది?, మా మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది, కామెడీ ఎంతుంది, హ్యూమర్ ఎంత ఉంది అనేది సెప్టెంబర్ 7 న చూసి చెప్పండి. సినిమా చూశాక.. ఎలాంటి డౌట్లు అయినా క్లియర్ అయిపోతాయి’ అంటూ అతను చెప్పుకొచ్చాడు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus