Naveen Polishetty: ‘మిస్టర్‌… మిస్‌’ మీట్‌ గ్రీట్‌లో నవీన్‌ పొలిశెట్టి సారీ… ఎందుకంటే?

సినిమాను సింగిల్‌ హ్యాండెడ్‌గా ప్రమోట్‌ చేయడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే నవీన్‌ పొలిశెట్టిని చూడాల్సిందే. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాను సింగిల్‌ హ్యాండెడ్‌గా ప్రచారం చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ వరుసగా ఈవెంట్లు చేస్తూ ప్రచారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో అభిమానులకు క్షమాపణలు కోరాడు. సినిమా ఆలస్యం గురించి ఈ మేరకు కొన్ని విషయాలు చెపపాడు. నవీన్‌ పొలిశెట్టి, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’.

మహేష్‌బాబు.పి తెరకెక్కించిన ఈ సినిమా చాలా నెలల క్రితమే పూర్తయింది. అప్పటి నుండి సినిమాను అదిగో, ఇదిగో అంటూ చెబుతున్నా విడుదల సమయం దగ్గరకొచ్చేసరికి వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎందుకు వాయిదా వేస్తున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పలేదు కానీ… వాయిదాలు అయితే పడుతూ వచ్చాయి. ఇప్పుడు ఎట్టకేలకు సినిమా విడుదల కాబోతోంది. ‘మిస్‌.. మిస్టర్‌…’ సినిమా ఎట్టకేలకు ఏడో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా వివిధ నగరాలు సందర్శించి అక్కడి అభిమానుల్ని కలిసిన నవీన్‌.. హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో నిర్వహించిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో తనదైన కామెడీతో అభిమానుల్ని అలరించాడు. వారితో కలిసి సెల్ఫీలు దిగుతూ… సందడి చేశాడు. ఆ తర్వాత సినిమా ఆలస్యం గురించి మాట్లాడాడు. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమా చిత్రీకరణకు చాలా సమయం పట్టిందని, ఆ తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల వల్ల విడుదల ఆలస్యమైందని, ఆ తప్పు జరిగినందుకు తమను మన్నించాలని (Naveen Polishetty) నవీన్‌ పొలిశెట్టి ప్రేక్షకులను కోరాడు.

ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ఆలస్యమై.. అభిమానులను నిరాశకు గురిచేసిందని అనుకుంటున్నట్లు నవీన్‌ చెప్పాడు. మీరు మాపై చూపించే ప్రేమకు మంచి సినిమాను తప్ప మేం ఇంకేమీ ఇవ్వలేం అని చెప్పాడు. ‘జాతిరత్నాలు’ తర్వాత నవీన్‌, ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క నుండి వస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus