Navya Naveli: సినిమాలపై అమితాబ్‌ మనవారాలి రియాక్షన్‌ ఏంటంటే?

స్టార్‌ కిడ్స్‌ సినిమాల్లోకి వస్తే…. ‘నెపోటిజం’ అంటూ నానా మాటలు అంటున్న రోజులివి. మన దగ్గర మాటలకే పరిమితమైన నెపోటిజం బాలీవుడ్‌లో ఉద్యమాల వరకు వెళ్లింది. ఈ క్రమంలో స్టార్‌ కిడ్స్‌ కొందరు సినిమాల్లోకి రావడానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో అమితాబ్‌ బచ్చన్‌ మనవారాలు నవ్య నవేలిని ఓ నెటిజన్‌ సినిమాల గురించి అడిగాడు. దానికి ఆమె చెప్పిన సమాధానం ‘వావ్‌’ అనిపించేలా ఉంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నవ్య..

ఇటీవల గులాబీ రంగు దుస్తుల్లో ఓ గ్లామరస్‌ ఫొటోను షేర్‌ చేసింది. బాగా వైరల్‌ అయిన ఆ ఫొటో కింద ఓ అభిమాని ‘మీరు చాలా అందంగా ఉన్నారు. సినిమాల్లో ప్రయత్నించొచ్చుగా ’ అని అడిగాడు. దానికి నవ్య భలే సమాధానమిచ్చింది. ‘‘మీ అభిమానానికి కృతజ్ఞతలు. అందమైన మహిళలు వ్యాపారాల్లోనూ రాణించగలరు’’ అంటూ తన ఆసక్తి గురించి ఒక్క ముక్కలో చెప్పేసింది నవ్య. ఆ స్పందనపై పలువురు బాలీవుడ్‌ స్టార్‌లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక నవ్య సినిమా రంగ ప్రవేశం గురించి గతంలోనే ఆమె తల్లి శ్వేతా బచ్చన్‌ చెప్పారు. సినిమా రంగంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోతే తన తండ్రి అమితాబ్‌, తన సోదరుడు అభిషేక్‌ ఎంతలా కుంగిపోయేవారో చూశాను. అందుకే నా కూతురు సినిమాల్లోకి రాకపోవడమే మంచిదని భావిస్తున్నానని శ్వేతాబచ్చన్‌ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఒకవేళ వచ్చినా… నెటిజన్లు వదలరుగా!

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus