ఆ నటుడు పరిస్థితి ఇలా అయిందేంటి..?

బాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చాలా సినిమాలు చేశారు. తన పెర్ఫార్మన్స్ తో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో వ్యక్తిగత జీవితంలో వివాదాల కారణంగా అతడి ఫిల్మ్ కెరీర్ కూడా కాస్త డౌన్ అయింది. ఇదివరకు మాదిరి వరుసగా సినిమాలు చేయడం లేదు నవాజుద్దీన్. తన భార్య అలియాతో గొడవలు రోజురోజుకి శృతిమించుతుండడంతో నవాజ్ తన ఇంటికి కూడా వెళ్లకుండా హోటల్ లో ఉంటుండడం హాట్ టాపిక్ గా మారింది.

అలియా చాలా నవాజ్ కి దూరంగా ఉంటోంది. ఇటీవల అలియా దుబాయికి వెళ్లడానికి ప్రయత్నించగా.. పాస్ పోర్ట్ సమస్య కారణంగా వెళ్లలేకపోయింది. దీంతో తిరిగి ఆమె నవాజుద్దీన్ ఇంటికి వచ్చింది. అయితే అలియాకు తమ ఇంట్లో ఉండే అర్హత లేదంటూ నవాజ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవాజ్ నుంచి తనకు ఇంకా విడాకులు రాలేదని.. అలాంటప్పుడు అతడి ఇంట్లో ఎందుకు ఉండకూడదని ఆమె వాదిస్తోంది. అలానే నవాజుద్దీన్ తల్లి వేధిస్తోందని పోలీసులకు రివర్స్ లో కంప్లైంట్ చేసింది.

నవాజుద్దీన్ ఇంట్లో తనకు సరిగా తిండి పెట్టడం లేదని.. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కూడా ఆమె ఆరోపించింది. ఇలా గొడవ పెద్దది కావడంతో నవాజుద్దీన్ తన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఈ గొడవ తేలి, తన భార్య నుంచి విడాకులు వచ్చే వరకు ఇంటికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారట నవాజుద్దీన్. అప్పటివరకు ఆయన హోటల్ లోనే ఉండబోతున్నారు.

ఇక ఆయన కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆరేడు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. అలానే రీసెంట్ గా ఓ తెలుగు సినిమా సైన్ చేశారు. వెంకటేష్ హీరోగా.. శైలేష్ కొలను తెరకెక్కిస్తోన్న సినిమాలో నవాజుద్దీన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus