ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రాలకు అంతర్జాతీయ రోటర్‌డామ్ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఆర్‌ఆర్) పురస్కారాలు అందిస్తూ ఉంటుంది. 50 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో ఇప్పటివరకు భారత్ నుంచి ఒక్క సినిమా మాత్రమే అవార్డు గెలుపొందింది. అది కూడా 2017లో. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మరో భారతీయ సినిమాకు ఆ గౌరవం దక్కింది. నయనతార, విఘ్నేశ్ శివన్ కలసి నిర్మించిన ‘కూజంగళ్’ అనే తమిళ సినిమాకు ఈ ఏడాదికిగాను టైగర్ పురస్కారం దక్కింది. ఇది ఈ చిత్రోత్సవంలో అత్యున్నత పురస్కారం.
ఐఎఫ్‌ఆర్‌ఆర్‌లో పురస్కారం అందుకున్న రెండో సినిమా ‘కూజంగల్’. అంతకుముందు 2017లో ‘సెక్సీ దుర్గా’ అనే మలయాళ చిత్రానికి ఈ గౌరవం దక్కింది. సనల్ కుమార్ శశిధరన్ తెరకెక్కించారు. ఇక ‘కూజంగల్’ చిత్రాన్ని పీఎస్ వినోద్ రాజ్ తెరకెక్కించారు. నయనతార విఘ్నేశ్ శివన్ కలిసి రౌడీ పిక్చర్ బ్యానర్‌పై నిర్మించారు. గ్లోబల్ వెర్షన్‌కు ‘పెబెల్స్’ అనే పేరు పెట్టారు. అంటే గులకరాళ్లు అని అర్థం. ఈ సినిమా ప్రదర్శన కోసం విఘ్నేశ్ శివన్, నయన తార ఫెస్టివల్‌కి వెళ్లారు. ఆ ఫొటోలు ఇటీవల వైరల్ అయ్యాయి.
ఇక సినిమా కథ విషయానికొస్తే… ఓ తాగుబోతు భర్త కుటుంబం నేపథ్యంలో సినిమా సాగుతుంది. తాగుడు భర్త బానిస అవడంతో.. ఆ ఇల్లాలు ఇంటి నుంచి వెళ్లిపోతుంది. దీంతో తన కొడుకుతో కలసి భార్యను తిరిగి ఇంటికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో సినిమా సాగుతుంది. మధురై సమీపంఓని మేలూరులో జరిగినట్లుగా సినిమా తెరకెక్కించారు. సినిమా నేపథ్యం, తీసిన విధానం, కథ,కథనాలు నచ్చి జ్యూరీ ఈ సినిమాకు టైగర్ పురస్కారం అందించాయి. ఇందులో నటించినవారంతా కొత్తవారు కావడం గమనార్హం.
Most Recommended Video
జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?