Nayanathara, vignesh: న్యూ ఇయర్ కానుకగా పేదలకు బహుమతులు ఇచ్చిన నయన్ దంపతులు!

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నయనతార గురించి అందరికీ సుపరిచితమే. ఈమె గత కొన్ని సంవత్సరాల నుంచి డైరెక్టర్ విగ్నేష్ శివన్ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇక డైరెక్టర్ విగ్నేష్ ను ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తర్వాత వీరు సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇలా పిల్లలతో నయనతార దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇక పెళ్లి కాకుండానే వీరిద్దరూ సహజీవనం చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రతి ఏడాది నూతన సంవత్సరం కానుకగా ఇతర దేశాలలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేవారు. కానీ ఈ ఏడాది మాత్రం ఎలాంటి పార్టీలు పబ్బులు లేకుండా నయనతార దంపతులు నూతన సంవత్సరాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. నయనతార విగ్నేష్ కొన్ని బహుమతులను తీసుకొని రోడ్డు పక్కన ఉన్నటువంటి నిరుపేదలకు చిన్న పిల్లలకు కానుకలు ఇస్తూ మీరు నూతన సంవత్సరాన్ని ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.

ఇలా రోడ్డు పక్కన ఉన్నటువంటి నిరుపేదలకు ఈ దంపతులు స్వయంగా వారి దగ్గరకు వెళ్లి కానుకలు ఇవ్వడంతో వారు కూడా చాలా సంతోషంగా కానుకలు అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది నెటిజెన్లు వీరు చేసిన మంచి పనికి ఫిదా అవుతున్నారు.

ఇక నయనతార పెళ్లి అయినా కూడా ఏమాత్రం అవకాశాలు కోల్పోకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె కనెక్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదేవిధంగా అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus