Nayanthara, Vignesh Shivan: పెళ్లి వార్తలు కన్ఫర్మ్ చేసిన నయన్-విఘ్నేష్!

  • June 5, 2022 / 01:20 PM IST

కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్, స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే. అయితే తమ పెళ్లి గురించి ఇటు విఘ్నేష్ శివన్ కానీ.. అటు నయనతార కానీ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇద్దరూ పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రం చేసుకుంటున్నారు. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కావడంతో ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలను ఆహ్వానిస్తున్నారు.

తాజాగా నయనతార సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులను కూడా తమ పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ను కాబోయే దంపతులు విఘ్నేష్ శివన్, నయనతార ప్రత్యేకంగా కలిసి పెళ్లి కార్డుని అందించి తమ వివాహానికి ఇన్వైట్ చేశారు. ఆయన కూడా వస్తానని తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి.

ఈ ఫొటోల్లో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా కనిపిస్తున్నారు. గతంలో హీరోగా సినిమాలు చేసిన ఉదయనిధి స్టాలింగ్ ఇప్పుడు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన నటించిన ఓ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఆ పరిచయంతోనే ఉదయనిధి కుటుంబాన్ని తన పెళ్లికి ఆహ్వానించింది నయన్.

అలానే ఈ పెళ్లికి రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోలు హాజరు కాబోతున్నారని సమాచారం. మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్ లో నయన్-విఘ్నేష్ ల పెళ్లి జరగబోతుంది. జూన్ 9న ఉదయం 4 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో హిందూ సంప్రదాయ పద్దతిలో వివాహం జరగనుంది. ఆ తరువాత చెన్నైలో ఓ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారట!

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus