Jr NTR: తారక్ అమెరికన్ యాక్సెంట్ గురించి వాస్తవాలివే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తో నటుడిగా ఏ స్థాయిలో ఎదిగారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొమరం భీముడో సాంగ్ లో తారక్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. విడుదలకు ముందు విడుదల తర్వాత ఆర్.ఆర్.ఆర్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకోగా రాబోయే రోజుల్లో ఈ సినిమాకు ఆస్కార్ కూడా వస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే అమెరికాలో తారక్ అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడగా కొన్ని వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.

తారక్ ఏ భాషలో మాట్లాడినా ఏ మాత్రం తడబడకుండా అద్భుతంగా మాట్లాడతారనే సంగతి తెలిసిందే. అమెరికా యాక్సెంట్ లో కూడా తారక్ అద్భుతంగా మాట్లాడారు. అయితే తారక్ అంటే గిట్టని కొంతమంది మాత్రం ఫేక్ యాక్సెంట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. తారక్ గొప్పదనాన్ని, టాలెంట్ ను చూసి కొంతమంది ఓర్వలేక ఈ తరహా కామెంట్లు చేస్తున్నారు. అలా నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లకు ఫ్యాన్స్ ధీటుగా బదులిస్తున్నారు.

అరవింద సమేత సినిమాలోని కొండను చూసి డైలాగ్ ఇలా కామెంట్లు చేసేవాళ్లకు కరెక్ట్ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అనవసరంగా తారక్ ను వివాదాల్లోకి లాగితే మాత్రం సహించబోమని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వచ్చే నెల నుంచి తారక్30 మూవీ రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

శరవేగంగా ఈ సినిమా షూట్ ను పూర్తి చేయనున్నారని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. షూటింగ్ మొదలుకాకుండానే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ అని సమాచారం. త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus