Trivikram, Anirudh: అనిరుధ్ విషయంలో త్రివిక్రమ్ తప్పు చేశారా?

త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అనిరుధ్ మ్యూజిక్ డైరెక్షన్ లో అజ్ఞాతవాసి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ మైనస్ అయిందని కామెంట్లు వినిపించాయి. అనిరుధ్ క్లాస్ సినిమాలకు మాత్రమే సరైన మ్యూజిక్ ఇవ్వగలరని మాస్ సినిమాలకు సరైన మ్యూజిక్ ఇవ్వలేరని కామెంట్లు వినిపించాయి. ఆ తర్వాత అనిరుధ్ తెలుగులో పలు సినిమాలకు పని చేసినా ఆ సినిమాలకు కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.

అయితే ఎన్టీఆర్30 సినిమా మోషన్ పోస్టర్ కు అనిరుధ్ బీజీఎం ఇవ్వగా ఈ బీజీఎంకు మంచి మార్కులు పడ్డాయి. అనిరుధ్ విషయంలో త్రివిక్రమ్ ఫెయిల్ అయితే కొరటాల పాస్ అయ్యారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాగా ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ తెరకెక్కనుండగా ఈ సినిమా తర్వాత అనిరుధ్ తెలుగులో వరుసగా స్టార్ హీరోల ఆఫర్లతో బిజీ కావడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కొరటాల శివ స్పెషల్ కేర్ తీసుకోవడం వల్లే అనిరుధ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మ్యూజిక్ ఇచ్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అనిరుధ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ జులై నుంచి మొదలుకానుంది. అనిరుధ్ ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ పనులను మొదలుపెట్టారని సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో బీస్ట్ సినిమాతో అనిరుధ్ మ్యూజిక్ కు మంచి మార్కులు పడ్డాయి.

సినిమాసినిమాకు అనిరుధ్ కు క్రేజ్ పెరుగుతోంది. అనిరుధ్ కు తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తున్నాయని అయితే సినిమాల ఎంపిక విషయంలో అనిరుధ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారని సమాచారం అందుతోంది. అనిరుధ్ ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అనిరుధ్ సినిమాలలోని పాటలు భాషతో సంబంధం లేకుండా సంచలనాలు సృష్టిస్తున్నాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus