మహేష్ ఫోటోలపై నెగటివ్ కామెంట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు కి కాస్త సమయం దొరికితే చాలు కుటుంబ సభ్యులతో గడుపుతాడన్న సంగతి అందరికీ తెలిసిందే. స్పైడర్ తర్వాత అతను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న భరత్ అనే నేను సినిమాని మొదట సంక్రాంతికి విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ ఈ సినిమాని ఏప్రిల్ 27 కి పోస్ట్ ఫోన్ చేశారు. దీంతో చాలా గ్యాప్ దొరికింది. తొందరపడకుండా రిలాక్స్ గా కొరటాల షెడ్యూల్ వేశారు. షెడ్యూల్ గ్యాప్ లో విదేశాల్లో విహరిస్తున్నారు. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార తో కలిసి మహేష్ గడుపుతున్నారు. డిసెంబర్ 13 నుండి 26 వరకు తమిళనాడులోని కారైకుడిలో షూటింగ్ లో పాల్గొన్న మహేష్ తర్వాత భారీ ట్రిప్ ప్లాన్ చేశారు. క్రిసమస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొత్తం విదేశాల్లోనే జరుపుకున్నారు.

ఒమన్ దేశానికి వెళ్ళిన మహేష్ అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను నమ్రత లీక్ చేసింది. మంచి హ్యాపీ మూడ్ లో ఫ్యామిలీ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఫోటోలను చూసి కొంతమంది అభిమానులు ఆనందపడుతుంటే.. మరికొంతమంది నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రెండు చిత్రాలు ఫెయిల్ అయి అభిమానులు బాధపడుతుంటే మహేష్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. టూర్ నుంచి వచ్చిన వెంటనే మిగిలిన మూడు పాటలు, ఒక ఫైట్ ను చిత్రీకరించనున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ముఖ్యమంత్రిగా మహేష్ నటిస్తున్న ఇందులో ప్రతి పక్షనేతగా పోసాని కృష్ణమురళి నవ్వులు పూయించనున్నట్టు సమాచారం. ఇండస్ట్రీ హిట్ శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus