Avatar2: అవతార్1 ను మించి అవతార్2 మెప్పించడం కష్టమేనా?

మరికొన్ని గంటల్లో అవతార్2 మూవీ థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని పలు థియేటర్లలో అవతార్2 మూవీకి టికెట్లు దొరకడం సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వేర్వేరు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుండగా అవతార్2 ఇంగ్లీష్ వెర్షన్ కు కూడా హైదరాబాద్ లోని థియేటర్లలో బుకింగ్స్ బాగున్నాయి. ఈ సినిమా టాక్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవతార్2 సినిమా ఇండియన్ సినిమాల కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పలువురు థియేటర్ల యజమానులు కేవలం ఈ సినిమా కోసం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్క్రీన్లను మార్చడంతో పాటు సౌండ్ సిస్టమ్స్ విషయంలో మార్పులు చేశారు. తాజాగా ముంబైలో సెలబ్రిటీల కోసం అవతార్2 స్పెషల్ షో స్క్రీనింగ్ జరగడం గమనార్హం. ఈ షో చూసిన సెలబ్రిటీల నుంచి సినిమాకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అవతార్1 స్థాయిలో అవతార్2 మెప్పించడం కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి. నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ కామెంట్లు వస్తున్న నేపథ్యంలో సాధారణ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తే సమస్య లేదు

కానీ యావరేజ్ టాక్ వస్తే మాత్రం ఇబ్బందేనని చెప్పవచ్చు. భారీ అంచనాలే నెగిటివ్ రివ్యూలకు కారణమని కొంతమంది భావిస్తున్నారు. 50,000కు పైగా స్క్రీన్లలో రిలీజవుతున్న ఈ సినిమాకు భారీ టార్గెట్ ఉంది. అవతార్2 బ్రేక్ ఈవెన్ అయితే మాత్రం మరిన్ని అత్యంత భారీ బడ్జెట్ సినిమాల దిశగా అడుగులు పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా టికెట్ రేట్లు సైతం ఎక్కువగానే ఉన్నాయి. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కిన అవతార్2 మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది. అవతార్2 కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ఏ సెంటర్లలో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయనే సంగతి తెలిసిందే.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus