Neha Shetty: మరోసారి టిల్లు కోసం ఎదురుచూపుల్లో నేహా శెట్టి!

‘డీజే టిల్లు’ (Dj Tillu) సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ సంపాదించిన నేహా శెట్టి (Neha Shetty), రాధిక పాత్రతో యూత్‌లో భారీ క్రేజ్ తెచ్చుకుంది. 2022లో వచ్చిన ఈ సినిమా సిద్ధు జొన్నలగడ్డకే (Siddu Jonnalagadda) కాదు, నేహాకు కూడా బ్రేక్ ఇచ్చింది. అంతకుముందు చేసిన సినిమాలు ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు, కానీ ‘డీజే టిల్లు’ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ సినిమా తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో (Gangs of Godavari) విశ్వక్ సేన్ (Vishwak Sen) సరసన నటించినా, ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. దీంతో నేహాకు కొత్త అవకాశాలు తగ్గాయి.

Neha Shetty

‘టిల్లు స్క్వేర్’లో (Tillu Square) నేహా శెట్టి సర్‌ప్రైజ్ క్యామియో చేసింది. ఈ సినిమా 100 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్ అయినా, నేహాకు ఆ సక్సెస్ పెద్దగా ఉపయోగపడలేదు. రాధిక పాత్రతో ఆమె ఇమేజ్ ఫిక్స్ అయిపోవడంతో వైవిధ్యమైన రోల్స్ దక్కడం కష్టమైంది. స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా నేహా రెడీగా ఉన్నా, అలాంటి ఆఫర్లు రావడం లేదు. ఇప్పుడు ఆమె టిల్లు సీక్వెల్ ‘టిల్లు క్యూబ్’ కోసం ఎదురుచూస్తోందని టాక్. ఈ సినిమాలో రాధిక పాత్ర కొనసాగితే, నేహాకు మళ్లీ క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.

‘టిల్లు స్క్వేర్’లో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కూడా హీరోయిన్‌గా చేసినా, ఆమెకు కూడా కొత్త అవకాశాలు అంతగా రాలేదు. సిద్ధు జొన్నలగడ్డ టిల్లు పాత్రతో డామినేట్ చేయడంతో హీరోయిన్ల క్రెడిట్ తగ్గిపోతోందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. నేహా మాత్రం రాధిక ఇమేజ్‌ను వదిలించుకొని కొత్త కథలు, వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఆశిస్తోంది. కానీ, అలాంటి అవకాశాల కోసం ఆమె ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది.

సినిమా ఆఫర్లు లేని ఈ గ్యాప్‌లో నేహా శెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటో షూట్స్‌తో అలరిస్తోంది. ఆమె గ్లామరస్ లుక్స్ టిల్లు ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తున్నాయి. ‘టిల్లు క్యూబ్’ లాంటి ప్రాజెక్ట్ ఆమెకు మళ్లీ బ్రేక్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. నేహా కెరీర్‌ను రీస్టార్ట్ చేసే అవకాశం రాధిక పాత్రలోనే ఉందా లేక కొత్త పాత్రలతో సక్సెస్ అందుకుంటుందా అనేది చూడాలి.

ముదిరిన ‘రెట్రో’ వివాదం.. విజయ్ దేవరకొండపై పోలీస్ కంప్లైంట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus