Nelson: ‘బీస్ట్’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్ చేసిన నెల్సన్.. నెక్స్ట్ ఏంటి?
- October 16, 2026 / 06:26 PM ISTByFilmy Focus Desk
‘కోలమావు కోకిల’ సినిమాతో ఎనిమిదేళ్ల క్రితం దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు నెల్సన్ దిలీప్ కుమార్. తొలి సినిమాతో ఈయనలో సత్తా ఉంది అని కోలీవుడ్ అర్థం చేసుకుంది. అయితే మూడేళ్ల పాటు ఆయన నుండి సినిమా రాలేదు. అయితే అది కరోనా టైమ్ కావడం గమనార్హం. ఆ గ్యాప్ తర్వాత నెల్సన్ చేసిన ‘డాక్టర్’ సినిమా భారీ విజయం అందుకుంది. ఇక ఈయనకు తిరుగులేదు అని అనుకోగా ‘బీస్ట్’ సినిమాతో చిన్నగా జర్క్ వచ్చింది. ఆ సినిమాలో చర్చించిన అంశమో, డైలాగ్‌లో కారణం కానీ.. ఆ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది. విమర్శలూ వచ్చాయి.
Nelson
ఆ మాటల్ని సీరియస్‌గా తీసుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఆ తర్వాత రజనీకాంత్‌తో ‘జైలర్’ అనే సినిమా చేశారు. ఫుల్‌గా కేమియోలు నింపి తీసుకొచ్చిన ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఇక జోరు మొదలు అనుకోగా మూడేళ్ల వరకు సినిమా రాలేదు. ఆ గ్యాప్‌ను పూర్తిగా మరపిస్తూ ‘జైలర్ 2’ సినిమా చేశారు. సేమ్ కాంబినేషన్, సేమ్ కేమియోల సెటప్‌తో ఈసారి కూడా విజయం అందుకున్నారు. ఈ క్రమంలో ‘బీస్ట్’ విమర్శలను మరోసారి బ్లాస్ట్ చేశారు అని చెప్పొచ్చు.
ఈ నేపథ్యంలో నెల్సన్ చేతిలో నెక్స్ట్ ఉన్న సినిమాలేంటో చూస్తే.. వెంటనే ‘కమల్ హాసన్ – రజనీకాంత్’ సినిమా ఉంది. ఇండియన్ సినిమాలోనే ఇంతకుమించిన బ్లాక్‌బస్టర్ కాంబో లేదు. దీనికి నెల్సనే డైరక్టర్. అయితే ఇందులో హీరో ఎవరు అని హీరోలు అడిగితే ఆయన సమాధానం చెప్పలేదు. చూద్దాం త్వరలో చెబుతారేమో. ఈ సినిమా తర్వాత తారక్‌తో ఓ సినిమా ఉంటుందని టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
అలాగే, కొన్ని రోజుల క్రితం సూర్య, ధనుష్‌కి నెల్సన్ వేర్వేరుగా రెండు స్టోరీ లైన్లు చెప్పారట. అందులో ఏది ముందు మెటీరియలైజ్ అయితే ముందు దానినే స్టార్ట్ చేస్తారట. ఈ రెండు సినిమాలు కూడా సితార బ్యానర్లోనే అంటున్నారు. అంటే మూడు సినిమాల్లో మూడు అవ్వొచ్చు, లేదంటే ఎవరో ఒకరిదే అవ్వొచ్చు. ఒకవేళ సూర్య సినిమా ఓకే అయితే అది ఆయన 50వ సినిమా అవుతుంది.
ఇవన్నీ అయిపోయాక.. ‘జైలర్ 3’ సినిమా కూడా ఉంటుంది అని చెబుతున్నారు. మరి రజనీకాంత్ ‘జైలర్ 2’ సినిమాను ఓటీటీలో చూసినప్పుడు ‘జైలర్ 3’ సినిమా చేయాలని అనిపిస్తుందో లేదో చూడాలి.














