ఆగస్ట్ 8న ‘నేనే రాజు నేనే మంత్రి’ ప్రీ రిలీజ్ ఈవెంట్
- August 5, 2017 / 07:30 AM ISTByFilmy Focus
“బాహుబలి”తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకొన్న రాణా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “నేనే రాజు నేనే మంత్రి”. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై విడుదలైన టీజర్, ట్రైలర్లు విపరీతమైన క్రేజ్ ను పెంచాయి. తేజ మునుపటి చిత్రాల ట్రాక్ రికార్డ్ ను పట్టించుకోకుండా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కాజల్, కేతరీన్ లాంటి గ్లామరస్ హీరోయిన్స్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తుండడం, తెలుగుతోపాటు తమిళ-కన్నడ-మలయాళ భాషల్లోనూ సినిమా విడుదలవుతుండడంతో మార్కెట్ పరంగానూ భారీ క్రేజ్ ఏర్పడింది.
ఇటీవలే రెగ్యులర్ ఆడియో రిలీజ్ ఈవెంట్లకు భిన్నంగా “జోగేంద్ర యువగర్జన” అంటూ పబ్లిసిటీకి తెరతీశారు. బిత్తిరి సత్తి యాంకరింగ్ పుణ్యమా అని ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అదే తరహాలో మరింత వైవిధ్యంగా “నేనే రాజు నేనే మంత్రి” ప్రీరిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఆగస్ట్ 8న హైద్రాబాద్ లో ఈ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. చిత్ర బృందం మొత్తం హాజరుకానున్న ఈ కార్యక్రమానికి ఈసారి రాజకీయనాయకులు కూడా విచ్చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













