‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం ‘భోళా శంకర్’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాళమ్’ అనే ఇండస్ట్రీ హిట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం. వాస్తవానికి అదే చిత్రాన్ని పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో చేయాలని భావించారు ‘హరిహర వీరమల్లు’ నిర్మాత ఏ.ఎం.రత్నం. పూజా కార్యక్రమాలతో ఆ ప్రాజెక్టు లాంఛనంగా మొదలైంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. తర్వాత ‘వేదాళమ్’ రీమేక్ జోలికి ఎవ్వరూ పోలేదు.
అయితే 2020 కోవిడ్ టైంలో దర్శకుడు మెహర్ రమేష్ చిరంజీవి చేపట్టిన సి సి సి కార్యక్రమానికి చాలా సహాయ సహకారాలు అందించాడు. దీంతో చిరంజీవి ఇంప్రెస్ అయిపోయి అతనికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఓ సినిమా చేసి పెట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ‘వేదాళమ్’ రీమేక్ ను ఎంపిక చేసుకున్నారు.
ఒరిజినల్ తో పోలిస్తే.. కొన్ని మార్పులు చేసి ‘భోళా శంకర్’ స్క్రిప్ట్ రెడీ చేశారు మెహర్ రమేష్. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. 2023 ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సినిమా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. బయ్యర్స్ సగానికి సగం పైనే నష్టపోయారు.
కానీ నిర్మాత అనిల్ సుంకరకి మాత్రం ‘భోళా శంకర్’ తో ఎటువంటి నష్టాలు రాలేదు అని సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత వచ్చిన సినిమా కావడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ మంచి రేటుకి వెళ్ళాయి. థియేట్రికల్ రైట్స్ కూడా బాగానే అమ్ముడయ్యాయి. ఈ సినిమా మాత్రమే కాదు.. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన సినిమాలు అన్నీ కమర్షియల్ గా సేఫ్ అయ్యాయని, నిర్మాతలకు ఎటువంటి నష్టాలు రాలేదని, తన కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అని పిలవబడే ‘శక్తి’ కూడా నిర్మాతకు లాభాలు అందించిందని మెహర్ రమేష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.