నేను మీకు బాగా కావాల్సిన వాడిని: రొటీన్ రొట్టకొట్టుడేనట.. టాక్ ఏంటి ఇలా ఉంది?

కిరణ్ అబ్బవరం,సంజ‌న ఆనంద్‌ జంటగా నటించిన మూవీ ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’.ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌వంటి వారు ఈ సినిమాలో నటించడం ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే దివంగత స్టార్ డైరెక్టర్ కోడి రామ‌కృష్ణ‌ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మించడం మరో స్పెషల్ అట్రాక్షన్. ‘ఎస్.ఆర్ కళ్యాణ మండపం’ తో లాటరీలో ఓ సూపర్ హిట్ కొట్టిన శ్రీధర్ గాదె ఈ చిత్రానికి దర్శకుడు.

టీజర్, ట్రైలర్ వంటివి పరమ రొటీన్ గా ఉండడంతో ఈ సినిమా పై బజ్ క్రియేట్ అవ్వలేదు. అయినప్పటికీ సెప్టెంబర్ 16న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ఈ చిత్రాన్ని చూసిన కొంతమంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం సినిమా పరమ రొటీన్ గా ఉందట. ఎక్కడా కూడా సినిమా ఆకట్టుకునే విధంగా లేదని, పాటలు కూడా వినసొంపుగా లేవని ప్రేక్షకులు అంటున్నారు.

యూత్ లో హీరో కిరణ్ అబ్బవరం కి క్రేజ్ ఉందని జనాలు ఫీలవుతున్నారు కాబట్టి.. ఈ మూవీకి ఓపెనింగ్స్ రావడం జరుగుతుందేమో కానీ బాక్సాఫీస్ వద్ద నిలబడే అవకాశాలు లేవని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. చీటికీ మాటికీ కిరణ్ కు ఏదో టాప్ హీరోకి ఇచ్చిన స్లో మోషన్ ఎలివేషన్స్ ఇరిటేట్ చేసే విధంగా ఉన్నట్టు కూడా ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus