Nenu Student Sir Collections: ‘నేను స్టూడెంట్ సర్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘స్వాతిముత్యం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి పాస్ మార్కులు వేయించుకున్నాడు బెల్లంకొండ గణేష్. అతను హీరోగా రూపొందిన రెండో సినిమా ‘నేను స్టూడెంట్ సర్’. రాకేష్‌ ఉప్పలపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ ఓకే అనిపించాయి.

జూన్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినా కొంత వరకు ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి.కానీ రెండో రోజు నుండి ఈ మూవీ బుకింగ్స్ డౌన్ అయిపోయాయి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.15 cr
సీడెడ్ 0.05 cr
ఆంధ్ర 0.08 cr
ఏపీ+ తెలంగాణ టోటల్ 0.28 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.04 cr
వరల్డ్ వైడ్ టోటల్ 0.32 cr

‘నేను స్టూడెంట్ సర్’ (Nenu Student Sir) చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.8 కోట్లు. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ కేవలం రూ.0.32 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. రూ.1.48 కోట్ల దూరంలో ఈ మూవీ రన్ ముగిసిపోయింది. దీంతో ఈ మూవీ కూడా గణేష్ కు కమర్షియల్ సక్సెస్ ను అందించలేకపోయింది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus