Nenu Student Sir Twitter Review: ‘నేను స్టూడెంట్ సర్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

‘స్వాతిముత్యం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి పాస్ మార్కులు వేయించుకున్నాడు బెల్లంకొండ గణేష్. అతను హీరోగా రూపొందిన రెండో సినిమా ‘నేను స్టూడెంట్ సర్’. రాకేష్‌ ఉప్పలపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ ఓకే అనిపించాయి.

జూన్ 2న ఈ సినిమా (Nenu Student Sir) రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో బోర్ కొట్టిందని, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ బాగుందని.. సెకండాఫ్ పై క్యూరియాసిటీ పెంచిందని అంటున్నారు. అయితే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ లు తప్ప కథనం వీక్ గా ఉంది అని అంటున్నారు.

హీరో బెల్లంకొండ గణేష్ కు స్టోరీ సెలక్షన్ విషయంలో మంచి టేస్ట్ ఉందని, డీసెంట్ గా పెర్ఫార్మ్ చేస్తున్నాడని అంటున్నారు. హీరోయిన్ అవంతిక బాగానే నటించిందని.. ఆమె లుక్స్ బాగున్నాయని అంటున్నారు. ఓవరాల్ గా ఈ మూవీ కూడా బిలో యావరేజ్ అనే విధంగా ఉంది అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక టాక్ ఎలా ఉంటుందో చూడాలి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus