తమిళ స్టార్ హీరో విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వాల్సిందే. తాజాగా ఆయన నటిస్తోన్న ‘మాస్టర్’ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతోంది. రెండు వారాలలో 40 మిలియన్ల వ్యూస్ సాధించి విజయ్ స్టామినా ఏంటో నిరూపించింది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కావాల్సివుంది. కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది.
అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి గాను భారీ మొత్తం నిర్మాతలకు డబ్బు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ‘మాస్టర్’ లాంటి భారీ బడ్జెట్ సినిమా థియేటర్లోనే రిలీజ్ అవుతుందని.. ఓటీటీలో రిలీజయ్యే ఛాన్స్ లేదని గతంలో నిర్మాతలు ప్రకటించారు. దర్శకుడు లోకేష్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. థియేటర్ల సంఘం కూడా విజయ్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే ఒప్పుకోమంటూ హెచ్చరిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి అంత బాగాలేదు. పూర్తి స్థాయిలో థియేటర్లు తెరిచినా.. జనాలు వస్తారనే నమ్మకం లేదు. అందుకే దర్శకనిర్మాతలు మనసు మార్చుకొని సినిమాని ఓటీటీకి ఇవ్వాలని చూస్తున్నారట. దీనికోసం నెట్ ఫ్లిక్స్ తో రూ.100 కోట్లకు పైగానే డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైంధి ‘మాస్టర్’ సినిమా 2021 జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ వార్తలపై చిత్రబృందం ఇంకా స్పందించలేదు. ఈ సినిమాలో విజయ్ సరసన మాళవికా మోహనన్ హీరోయిన్ గా కనిపించనుండగా.. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?