‘యానిమల్’ సినిమా నిడివి గురించి సినిమా రిలీజ్‌కు కొంచెం ముందు పెద్ద చర్చే జరిగింది. సినిమా నిడివి 3 గంటల 21 అని తెలిసేసరికి వామ్మో అనుకున్నారు. అయితే సినిమా రిలీజ్‌కు ఒకట్రెండు రోజుల ముందు షాకింగ్ విషయం ఒకటి ముందుకొచ్చింది. అదే ఈ సినిమా ఒరిజినల్ నిడివి నాలుగు గంటలకుపైనే అని తెలిసింది. ఓటీటీలో సినిమా వచ్చేటప్పుడు ఆ కంటెంట్ చూడొచ్చు అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు ఓటీటీ పార్టనర్ మాత్రం భారీ షాక్ ఇచ్చింది.
థియేటర్లలో ‘యానిమల్’ సినిమా వచ్చాక ఆ నిడివి పెద్ద విషయం కాదు అని అర్థమైంది. సినిమా గ్రిప్పింగ్‌గా ఉండటంతో అంతసేపు సినిమాను కూడా చూసేశారు, ఎంజాయ్ చేశారు కూడా. దీంతో నాలుగు గంటల సినిమా కూడా చూసేస్తారు అని అనుకున్నారు. సినిమా వచ్చాక అందులోని కొన్ని యాక్షన్ సీన్లు, ఇంటిమేట్ సీన్లు చూసి మిగిలిన ఆ 39 నిమిషాల సినిమాలో కూడా అంత హై ఉంటుంది కదా అని ఎక్స్పెక్ట్ చేశారు. ఉంటుందో లేదో తెలియదు కానీ… చూడటానికి అయితే అవ్వదు.
ఎందుకంటే ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సెన్సార్ అప్రూవ్ చేసిన థియేటర్ వెర్షన్‌ను మాత్రమే ఓటీటీలో చూపించాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం తీసుకుందట. ఇది ఆ ఒక్క సినిమాకే కాకుండా అన్ని సినిమాలకూ వర్తిస్తుందని చెప్పింది. ఓటీటీ సెన్సార్ షిప్ విషయంలో చర్చలో ఉన్న నేపథ్యంలో థియేటర్ వెర్షన్ తీసుకుంటే సమస్య ఉండదు అని ఓటీటీలు అనుకుంటుండటమే దీనికి కారణం.
ఈ నేపథ్యంలో ‘యానిమల్’ (Animal) అభిమానులకు పెద్ద నిరాశే ఎదురైంది అని చెప్పాలి. ఎందుకంటే సినిమా టీమ్‌లో కొంతమంది ఇప్పటికే ఆ డిలీటెడ్ సీన్ల గురించి భారీ హైప్ ఇచ్చారు. రణ్‌బీర్ కపూర్, బాబీ డియోల్ ఇలా చాలామంది ‘ఆ సీన్స్ కూడా ఉండుంటేనా? అదిరిపోయేది’ అని చెప్పారు. కానీ ఏం చేస్తాం ఆ సీన్స్ ఓటీటీలో రావు. మరి యూట్యూబ్‌లో అయినా ఇస్తారేమో చూడాలి.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!