నెట్‌ఫ్లిక్స్‌ తమ లిస్ట్‌ చెప్పేసింది.. లైనులో ఎన్ని సినిమాలున్నాయంటే?

పెద్ద పెద్ద బ్యానర్లలో తెరకెక్కుతున్న పెద్ద హీరోల సినిమాలకు పోటీగా.. పెద్ద సిరీస్‌లు, వెబ్‌ ఫిల్మ్స్‌ రూపొందుతున్న రోజులవి. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) కూడా అదే పనిలో ఉంది. తమ టీమ్‌ సిద్ధం చేసిన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాల్ని నెట్‌ఫ్లిక్స్‌ టీమ్‌ రీసెంట్‌గా అనౌన్స్‌ చేసింది. దాని బట్టి చూస్తే ఈ ఓటీటీలో స్టార్లు లైన్‌ కట్టేస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటి వరుసగా ప్రాజెక్ట్‌లు రానున్నాయి. వెంకటేశ్‌ (Venkatesh Daggubati) , రానా (Rana Daggubati) ప్రధాన పాత్రల్లో రూపొందిన కాంట్రవర్శియల్‌ వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’కి (Rana Naidu) సీక్వెల్‌ను అనౌన్స్‌ చేశారు.

Netflix

‘రానా నాయుడు’ కొత్త సీజన్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేశ్‌ (Keerthy Suresh), రాధికా ఆప్టే (Radhika Apte)  కలసి నటించిన రివెంజ్‌ డ్రామా వెబ్‌సిరీస్‌ ‘అక్క’ గ్లింప్స్‌ అయితే అదిరిపోయింది. కీర్తికి ఇది తొలి వెబ్‌సిరీస్‌. సౌత్‌ యువ హీరో సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) ‘సూపర్‌ సుబ్బు’ అనే బోల్డ్‌ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మంచి విజయం అందుకున్న వెబ్‌ సిరీస్‌లకు కొత్త సీజన్లను అనౌన్స్‌ చేశారు.

క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘కోహ్రా 2’, ‘దిల్లీ క్రైమ్‌ 3’ రానున్నాయి. వీటితోపాటు ‘గ్లోరీ’, ‘మండలా మర్డర్స్‌’, ‘ది రాయల్స్‌’ వస్తాయి. వీటితోపాటు బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ కానుంది. సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) తనయుడు ఇబ్రహీం హీరోగా నటించిన తొలి సినిమా ‘నాదానియా’ కూడా ఇందులోనే వస్తుంది.

ఇక సినిమాల గురించి చూస్తే.. మాధవన్‌ (Madhavan), నయనతార(Nayanthara), సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్‌ బేస్డ్ మూవీ ‘టెస్ట్‌’ రెడీ అయింది. సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో రాబీ గ్రేవాల్‌ తీసిన యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమా ‘జ్యువెల్‌ థీఫ్‌’ కూడా వచ్చేస్తోంది. రాజ్‌కుమార్‌ రావు (Rajkummar Rao), సన్యా మల్హోత్ర (Sanya Malhotra) ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్‌ కామెడీ ఫిల్మ్‌ ‘టోస్టర్‌’ సిద్ధం చేశారు. మాధవన్‌ హీరోగా రూపొందిన ‘ఆప్‌ జైసా కోయి’ రెడీ అవుతోందట.

విశాల్ బ్లాక్ బస్టర్ సినిమాని ఇక్కడ పట్టించుకోవడం లేదుగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus